మిస్సమ్మ భూములపై రాద్దాంతమా?, నిరూపిస్తే రాజకీయాల్లో ఉండను: గుర్నాథరెడ్డి
అనంతపురం: జిల్లాలోని మిస్మమ్మ భూములపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రె పార్టీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఈ వ్యవహారంలో తన కుటుంబం అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని గురునాథరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని గురునాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే వరదాపురం సురి అక్రమాల చిట్టా ప్రజలందరికీ తెలుసునని అన్నారు. పార్టీ మారుతున్నట్టు తనపై దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణం ఉన్నంతవరకు జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.

ప్రజారాజధాని కాదు.. పన్నుల రాజధాని
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రజారాజధానిలా కాకుండా.. పన్నుల రాజధానిగా చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శనివారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12వ రోజున ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.
చివరకు రాజధాని డిజైన్లను కూడా ప్రైవేటు వ్యక్తులే ఇచ్చారని, ప్రతిదాన్ని ప్రైవేటు పరం చేసి ప్రజలపై పన్నుల భారం మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.
రాజధానిపై ప్రభుత్వం అవాస్తవాలను చెబుతోందని మండిపడ్డారు. రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను 99 ఏళ్లు లీజుకిచ్చి తమ బినామీలకు మేలు చేసేలా ప్రభుత్వ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications