వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెగాస్టార్ సంచలనం- ఆ పంచాయితీ నేను చేయలేను : ఇండస్ట్రీ పెద్దగా ఉండలేను..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం వర్సస్ టాలీవుడ్ అన్నట్లుగా కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేసారు. సినిమా టిక్కెట్ల అంశంతో పాటుగా.. థియేటర్ల లో సోదాల వ్యవహారంతో ఏపీ లో సినీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో టాలీవుడ్ నుంచి పెద్దలు సీఎం జగన్ తో నేరుగా చర్చిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని పలువురు కోరుకుంటున్నారు. ఈ సమయంలో మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాను సినీ పరిశ్రమకు పెద్దగా ఉండను..ఉండలేను అంటూ తేల్చి చెప్పేసారు. కావాల్సినప్పుడు అండగా నిలబడతానన్నారు.

చిరంజీవి మనసులో మాట

చిరంజీవి మనసులో మాట

అవసరమైన సమయంలో మాత్రం ఆదుకుంటానని చెప్పారు. నేను ఉన్నానంటూ అవసరమైన సమయంలో ముందుకు వస్తానని..అన్ని సమయాల్లో తగుదనమ్మా అంటూ రానని తేల్చేసారు. ఎవరో ఇద్దరి మధ్య తగవు పెట్టుకొని ..దానిని పరిష్కరించమంటే తాను సిద్దంగా లేనని తన మనసులోని మాటను క్లియర్‌గా చెప్పేశారు. అటువంటి పదవి తనకొద్దని..పంచాయితీ చేసే ఉద్దశం తనకు లేదని క్లియర్ చేసారు. ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోవటం తనకు ఇష్టం లేదంటూ చిరంజీవి తేల్చి చెప్పేసారు. ఇద్దరి మధ్య పంచాయితీల విషయంలో తాను ముందుకు రానని మెగాస్టార్ స్పష్టం చేసారు.

సినీ పెద్దగా ఉండలేను..పంచాయితీలు చేయలేను

సినీ పెద్దగా ఉండలేను..పంచాయితీలు చేయలేను

కానీ, ఇదే సమయంలో సినిమా కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా ...తాను ఖచ్చితంగా ముందు నిలుస్తానని వెల్లడించారు. వాళ్ల కోసం తాను నిత్యం ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. ఏపీలో సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి ఇప్పటికే రెండు సార్లు సమావేశమయ్యారు, సినీ సమస్యల పరిష్కారానికి నాయకత్వం తీసుకోవాలని సీఎం జగన్ సైతం చిరంజీవికి సూచించారు. అయితే, ప్రస్తుతం సినీ సమస్యల పైన చర్చించేందుకు చిరంజీవి కొంత కాలంగా ఏపీ ప్రభుత్వంతో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. అందుకు సమయం ఇవ్వలేదనే అభిప్రాయం ప్రచారం లో ఉంది.

ఏపీ వర్సస్ ఇండస్ట్రీ కోల్డ్ వార్ నేపథ్యంలో నేనా

ఏపీ వర్సస్ ఇండస్ట్రీ కోల్డ్ వార్ నేపథ్యంలో నేనా

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆయన చర్చలకు ముందుకు రాలేదు. ఇండస్ట్రీలో పలువురు ముఖ్యులు మాత్రం చిరంజీవిని సినీ ఇండస్ట్రీ పెద్దగానే భావిస్తున్నారు. చిరంజీవి ..దాసరి నారాయణ రావు స్థానం భర్తీ చేయాలని కొందరు ఓపెన్ గా కోరగా.. మరి కొందరు చిరంజీవి సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలుస్తారని పలు సందర్భాల్లో ప్రశంసించారు.

కానీ, ఇప్పుడు ఏపీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న ప్రభుత్వం వర్సస్ సినీ ఇండస్ట్రీ సమస్యను ఉద్దేశించే పరోక్షంగా ఈ వ్యాఖ్యలను చేసినట్లుగా చర్చ మొదలైంది. సినీ కార్మికులకు యోధా డయాగ్నిస్టిక్స్‌ ల్యాబుల్లో టెస్టులు, చికిత్సకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు చెప్పారు. తన కోరిక మేరకు వెంటనే అంగీకరించిన యోధా డయాగ్నస్టిక్‌ యాజమాన్యానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. 50% రాయితీతో సినీ కార్మికులకు హెల్త్ కార్డులను అందించడం ఆనందంగా ఉందన్నారు చిరంజీవి.

English summary
Chiranjeevi takes a drastic decision that he can no longer act as an elder in the industry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X