NEET UG 2026 Retest: స్వయంగా రంగంలోకి ప్రధాని-సైనిక విమానాల్లో పేపర్ల రవాణా..!

ఈ ఏడాది వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష (NEET UG 2026)లో పేపర్ లీక్ కావడంతో 22.79 లక్షల మంది షాక్ కు గురయ్యారు. ఈ పరీక్షను రద్దు చేసిన కేంద్రం.. జూన్ 21న మరోసారి పరీక్ష (NEET UG 2026 Retest) నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఈ నేుథ్యంలో లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్రం.. ఈసారి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ ఈ నీట్ రీటెస్ట్ ను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఎయిర్ ఫోర్స్ ను కూడా రంగంలోకి దింపుతున్నారు.

నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనతో విద్యార్ధులు, తల్లితండ్రుల్లో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పేందుకు వీలుగా ప్రధాని మోడీ కార్యాలయం ఈసారి రీటెస్ట్ ను స్వయంగా పర్యవేక్షిస్తోంది. ప్రధాని మోడీ కూడా ఎప్పటికప్పుడు దీనిపై ఆరా తీస్తున్నారు. ఈసారి పరీక్షల్లో ఎలాంటి పొరబాట్లకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే పీఎంవో సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పీఎంవో ఆదేశాలతో నీట్ రీటెస్ట్ కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

NEET UG 2026 Retest PM Modi Steps In Air Force to Manage Logistics amp amp Transportation
నీట్ పేపర్ లీక్ పై సుప్రీం కీలక ఆదేశాలు..! ఎన్టీఏకు అక్షింతలు..!
నీట్ పేపర్ లీక్ పై సుప్రీం కీలక ఆదేశాలు..! ఎన్టీఏకు అక్షింతలు..!

జూన్ 21న జరగనున్న నీట్-యూజీ 2026 రీటెస్ట్ కు సంబంధించిన లాజిస్టిక్స్, రవాణా ఏర్పాట్లను నిర్వహించేందుకు భద్రతా దళాలను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాలు ధృవీకరించిన దాని ప్రకారం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హాజరయ్యారు. ఈ చర్చల సందర్భంగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అధికారులు కూడా పాల్గొన్నారు.

NEET UG 2026 Retest PM Modi Steps In Air Force to Manage Logistics amp amp Transportation
JEE-NEET Exam: నీట్, జేఈఈ విలీనం? ఇక ఒకే పరీక్ష..! కేంద్రం తాజా ప్లాన్..!
JEE-NEET Exam: నీట్, జేఈఈ విలీనం? ఇక ఒకే పరీక్ష..! కేంద్రం తాజా ప్లాన్..!

దేశవ్యాప్తంగా ముద్రణాలయాల నుండి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను సురక్షితంగా తరలించడానికి, రవాణా, లాజిస్టిక్స్ సాయం అందించేందుకు ఎయిర్ ఫోర్స్ నను మోహరించడానికి ఒక ప్రతిపాదన సిద్ధం చేశారు. ప్రధానమంత్రి కార్యాలయంతో సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రశ్నపత్రాలను పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా పంపిస్తున్నారు. ఇందులో అనేక నిర్వహణ కేంద్రాలు, అధికారులు పాల్గొంటారు.ప్రతిపాదిత ఎయిర్ ఫోర్స్ మద్దతుగల యంత్రాంగం లీకేజీల ప్రమాదాన్ని తగ్గించడం, భద్రతా ప్రోటోకాల్‌లను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+