PM Modi: వడగాల్పుల వేళ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సూచనలు..!
దేశవ్యాప్తంగా ప్రస్తుతం వేసవి ప్రభావం తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్దాయిలో నమోదవుతున్నాయి. వడగాల్పుల ప్రభావంతో జనం అల్లాడుతున్నారు. దీంతో మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ (PM Modi)
కూడా వడగాల్పులపై స్పందించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. ఇందులో వడగాల్పుల విషయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయని, దీనితో పాటు రోజువారీ జీవితంలో వేడి వలన కలిగే అనేక ఇబ్బందులు కూడా పెరుగుతున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. తన తోటి పౌరులకు సాధ్యమైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఇళ్ల నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీతో పాటు నీటిని తీసుకువెళ్ళాలని కోరారు.

देश के अलग-अलग हिस्सों में तापमान लगातार बढ़ रहा है और इसके साथ ही दैनिक जीवन में गर्मी से होने वाली कई कठिनाइयां भी बढ़ रही हैं। मैं सभी देशवासियों से आग्रह करता हूं कि जितनी अधिक सावधानी बरत सकें, अवश्य बरतें। कृपया स्वयं को हाइड्रेटेड रखें, घर से बाहर निकलते समय पानी साथ रखें।…
— Narendra Modi (@narendramodi) May 27, 2026
ఇటువంటి వాతావరణంలో, మీ సున్నితత్వం కూడా గొప్ప మద్దతుగా నిలుస్తుందని దేశ ప్రజలకు ప్రధాని మోడీ సూచించారు.
వీలైతే, దాహంతో ఉన్న ఎవరికైనా ఒక గ్లాసు నీటిని అందించాలన్నారు. అలాగే తమ ఇళ్ల మరియు దుకాణాల బయట జగ్‌లలో నీటిని ఉంచాలని, అలాంటి వారిని తాను అభినందిస్తానని తెలిపారు. తద్వారా ఎవరైనా వాటి నుండి నీటిని తాగవచ్చన్నారు. మొత్తం మీద వడగాల్పుల ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వంతో పాటు పౌరులు కూడా తమవంతు సహకారం అందించాలని ప్రధాని మోడీ చెప్పకనే చెప్పారు.












Click it and Unblock the Notifications