Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫైర్ బ్రాండ్ లైఫ్ లో ఇంత విషాదమా : సినిమా-రాజకీయాల్లోనూ కష్టాలే-రోజా కన్నీటి పర్యంతం...!!

మాటల తూటాలతో ప్రత్యర్ధుల పైన విరుచుకుపడే వైసీపీ ఫైర్ బ్రాండ్..నగరి ఎమ్మెల్యే రోజా జీవితం లో ఇంత విషాదం ఉందా అనే చర్చ మొదలైంది. ఎప్పుడూ రాజకీయాలు...జబర్దస్త్ షూటింగ్ లతో బీజీగా ఉండే రోజా సాధారణంగా నవ్వుతూనే కనిపిస్తారు. ఆగ్రహం వచ్చిన సమయంలో మాత్రం విరుచుకుపడతారు. తనకు అవమానం జరిగితే అంతే బాధ పడతారు. ఇక, జీవితంలో తాను ఎన్ని కష్టాలు పడ్డానో వివరిస్తూ రోజా కన్నీటి పర్యంతమవ్వటం వినాయక చవితి రోజున వైసీపీ శ్రేణులతో పాటుగా సాధారణ ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది.

రోజాకు పిల్లలు పుట్టరంటూ వైద్యులు

రోజాకు పిల్లలు పుట్టరంటూ వైద్యులు

వినాయక చవితి పండుగ స్పెషల్ గా ఒక టీవీ ఛానల్ లో వచ్చిన ఈవెంట్ లో రోజా తన వ్యక్తి గత విషయాలను చెబుతూ...ఏడ్చేసారు. రోజా తల్లి దండ్రులు ఇద్దరూ ఉద్యోగులే. తమకు తిండి..ఉండటానికి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదని రోజా చెప్పుకొచ్చారు. అయితే, తాను 1991 లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని..ఆ తరువాత సెల్వమణి తనను ఇష్టపడి తన ఇంట్లో వారితో చెప్పి పెళ్లి చేసుకున్నారని రోజా వివరించారు. ఇక, పెళ్లయిన తరువాత తనకు పెద్ద సైజులో ఫైబ్రాయిడ్ ఉండేదని..తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు చెప్పారంటూ గుర్తు చేసుకున్నారు.

రెండు నెలలు ఒకే పొజీషన్ లో కదలకుండా

రెండు నెలలు ఒకే పొజీషన్ లో కదలకుండా

అయితే. కొన్ని ఇబ్బందులతో తనకు ముందు కూతురు పుట్టిందని..అందుకే తన కుమార్తె అంటే అంత ఇష్టమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అదే విధంగా రెండో సారి ప్రెగ్నెన్సీ వచ్చిన సమయంలోనూ తాను రెండు నెలల పాటు మంచం పైనే వైద్యులు చెప్పిన విధంగా కదలకుండా..స్నానం కూడా చేయకుండా అదే పొజీషన్ లో ఉండిపోవాల్సి వచ్చిందంటూ ఆ బాధను తలచుకొని బాధ పడ్డారు. తన కుమారుడు ఏడో నెల డెలివరీ అయిందని చెప్పుకొచ్చారు. అందుకే..తనకు తన ఇద్దరు పిల్లలంటే ప్రాణంగా చూసుకుంటానని చెప్పారు.

11 ఏళ్ల ఆదాయం మొత్తం అప్పులకే చెల్లించానంటూ

11 ఏళ్ల ఆదాయం మొత్తం అప్పులకే చెల్లించానంటూ

ఇక, తన వివాహం తరువాత తన కుటుంబ సభ్యులంతా కలిసి సమరం అనే సినిమా తీసి భారీగా నష్టపోయామని వివరించారు. ఆ సినిమా కోసం చేసిన అప్పులు తీర్చటానికి తాను దాదాపు 11 ఏళ్ల పాటు సంపాదించిన సొమ్ము అంతా అప్పులు కట్టటానికే సరి పోయిందంటూ విలపించారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అనేక కష్టాలను ఎదుర్కొన్నానంటూ గుర్తు చేసుకున్నారు. టీడీపీ నుంచి పోటీ చేసినా ఓడిపోయిన రోజా .. 2014 లో వైసీపీ నుంచి తొలి సారి గెలవగానే ఆనందం తట్టుకోలేక ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నారు.

రాజకీయాల్లోనూ కష్టాలు పడ్డానంటూ రోజా..

రాజకీయాల్లోనూ కష్టాలు పడ్డానంటూ రోజా..

ఇక, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏకంగా శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు. 2019 లో రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచినా..వైసీపీ అధికారంలోకి వచ్చినా మంత్రి పదవి దక్కలేదు. నామినేటెడ్ పదవి వచ్చినా...అది ఇప్పుడు లేకుండా పోయింది. జిల్లాలో ఉన్న ఆధిపత్య రాజకీయాల్లో భాగంగా తనకు అధికారులు సైతం విలువ ఇవ్వటం లేదంటూ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో రోజా కన్నీరు పెట్టుకున్నారు. ఇక, సినిమాల్లో-రాజకీయాల్లో ఎన్నో కష్టాలు పెట్టిన వారిందరికీ తన ఎదుగుదలే సమాధానమని రోజా చెప్పుకొచ్చారు.

Recommended Video

    YSRCP MLA Roja : డిశ్చార్జ్‌ తర్వాత తొలిసారి కనిపించి.. దుమ్మురేపాలని కోరిన రోజా VIDEO
    ఆ కష్టాలే ఈ స్థాయికి చేర్చాయంటున్న రోజా

    ఆ కష్టాలే ఈ స్థాయికి చేర్చాయంటున్న రోజా

    ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి వారు ఆ రకంగా చేయటంతో ఏర్పడిన పట్టదలే సహకరించిందని వివరించారు. అయితే, ఆర్దికంగా .. ఆరోగ్య పరంగా రోజా ఎదుర్కొన్న కష్టాల పైన చెబుతున్న సమయంలో సహచర టీం సభ్యులు అందరూ తమ అవేదన వ్యక్తం చేసారు. ఇప్పుడు రోజా తన జీవితంలో చోటు చేసుకున్న విషాదాల గురించి తానే వెల్లడించటం చూసిన పార్టీ నేతల్లో ఇప్పుడు అవే విషయాలు చర్చగా మారాయి. కానీ, రోజాలో మాత్రం గతంలో కనిపించిన ఫైర్ ఇప్పుడు కనిపించటం లేదు. రోజా వ్యవహార తీరులో సైతం పూర్తిగా మార్పు వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+