హైదరాబాద్‌లో ఉండొద్దా?: బాబుVsకెసిఆర్ (పిక్చర్స్)

హైదరాబాద్: హైదరాబాదు పైన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కౌంటర్ ఇచ్చారు. హైదరాబాదును వదలాల్సి ఉంటుందనే బాధ చంద్రబాబుకు ఉందని కెసిఆర్ అన్నారు.

ఆ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ.. హైదరాబాదును తాను అభివృద్ధి చేశానని, నగర ప్రతిష్టను అంతర్జాతీయస్థాయికి తీసుకు వెళ్లానని, అలాంటి తాను ఇక్కడ ఉండవద్దట అన్నారు. నగరాన్ని డామేజ్ చేసిన కెసిఆర్ లాంటి వాళ్లు ఉండవచ్చా అని ప్రశ్నించారు.

కెసిఆర్ ఆరు నెలల పాటు ఫాం హౌస్‌లో ఉంటారు.. ఆ తర్వాత ఒక్కసారిగా బయటకు వచ్చి రబ్బిష్‌గా మాట్లాడుతారని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి గొప్ప నేతనా అని ప్రశ్నించారు. నగరాన్ని, తెలంగాణను అభివృద్ధి చేసిన తాను మాత్రం ద్రోహియా అని మండిపడ్డారు.

బాబు 1

బాబు 1

'ఎవరు దొరలు.. ఎవరు దొంగలు? ఎవరు అభివృద్ధి చేశారు? ఎవరు లూటీ చేశారు? ఇవన్నీ తేలాలి. దీనిపై ప్రతిరోజూ మాట్లాడతా. ఎవరీ కేసీఆర్!? ముప్పై ఏళ్లు రాజకీయాల్లో ఉండి ప్రజల కోసం ఏం చేశాడు?' అని చంద్రబాబు శివాలెత్తారు.

బాబు 2

బాబు 2

ఆరు నెలలు ఫాం హౌస్‌లో పడుకొని ఉండేవాడు కూడా తన గురించి మాట్లాడేవాడయ్యాడా? గాడిద చాకిరీ చేసి హైదరాబాద్‌ను ఈ స్థాయికి తెచ్చింది తానని, తెలంగాణను ఎంతో కొంత అభివృద్ధి చేసింది తానేనని బాబు చెప్పారు.

బాబు 3

బాబు 3

'పాత హైదరాబాద్ రాష్ట్రంలో ఐదు జిల్లాలు మహారాష్ట్రలో, మూడు జిల్లాలో కర్ణాటకలో ఉన్నాయి. అవెలా ఉన్నాయో ఇక్కడి తెలంగాణ జిల్లాలు ఎలా ఉన్నాయో వెళ్లి చూద్దాం.. రా! లెక్కలన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయన్నారు.

బాబు 4

బాబు 4

ఎవరి హయాంలో తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధి చెందాయో చర్చిద్దామని, దమ్ముంటే రావాలని చంద్రబాబు తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌కు సవాల్ విసిరారు.

బాబు 5

బాబు 5

మంగళవారం బాబు విలేకరులతో మాట్లాడారు. కెసిఆర్ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రబాబు నిప్పులు చెరిగారు. "క్యారెక్టర్ లేదు. వ్యక్తిత్వం లేదు. ఫాం హౌస్‌లో పడుకొంటే లేవడు. తెలంగాణ పునర్నిర్మాణం చేస్తాడట. 30 ఏళ్లలో ఏం చేశాడు? ఏడాదిన్నరపాటు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. తెలంగాణ కోసం ఏం చేశారు? ఇంటికి మూడెకరాల పొలం ఇస్తానని, కాలు అడ్డం పెడితే గోదావరి నీళ్లు వస్తాయని నోటికి వచ్చిన మాటలు చెప్పాడు. కాలు అడ్డం పెడితే నీళ్లు వస్తాయా? ఏనాడైనా ప్రజల సమస్యలపై బయటకు వచ్చి పోరాడిన చరిత్ర నీకు ఉందా?'' అని ధ్వజమెత్తారు.

కెసిఆర్ 1

కెసిఆర్ 1

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాహాటంగా విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారని, టిటిడిపి నేతలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని అంతకుముందు ప్రెస్ మీట్లో కెసిఆర్ అన్నారు.

కెసిఆర్ 2

కెసిఆర్ 2

తెలంగాణపై విషం చిమ్ముతున్న చంద్రబాబు కాళ్ల వద్ద టిటిడిపి నేతలు పడి ఉండాల్సిన అవసరం లేదని, బాబు వంటి లత్కోర్ నాయకులు ఉండరన్నారు. ఆయన ఎన్నిసార్లు మాటలు మారుస్తారని కెసిఆర్ ప్రశ్నించారు.

కెసిఆర్ 3

కెసిఆర్ 3

టిటిడిపి నేతలు ఇప్పటికైనా కళ్లు తెరిచి బయటకు రావాలని, చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మడం లేదని, హైదరాబాదును ఖాళీ చేయాల్సి వస్తుందనే చంద్రబాబు బాధ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+