నేను ఏ అధికారిని ఇబ్బంది పెట్టలేదు...రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్దమే: వసంత నాగేశ్వరరావు
విజయవాడ: తాను ఏ అధికారిని ఇబ్బంది పెట్టలేదని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని...అసలు నందిగామలో హత్యా రాజకీయాలకు ఆజ్యం పోసింది దేవినేని కుటుంబమేనని ఆయన ఆరోపించారు.
గుంటుపల్లి ఈవో నరసింహారావును వసంత నాగేశ్వరరావు బెదిరిస్తున్న ధోరణిలో ఉన్న ఆడియో వైరల్ కావడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ టేపుల్లో మంత్రి దేవినేని ఉమను హత్య చేస్తామనే రీతిలో ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో వసంత నాగేశ్వరరావు ఫోన్ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా...ఈ వివాదంపై వసంత నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు.
అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు రాగా దీనిపై సీరియస్‌గా స్పందించిన సీఎం చంద్రబాబు ఇలాంటి బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. బెదిరింపులు, హత్యలతో ఎవరూ ఏమీ సాధించలేరని...ఇలాంటి చర్యలను ఎంతటివారు ప్రోత్సహించినా తీవ్రస్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు. అయితే ఈ వ్యవహారంలో వసంత నాగేశ్వరరావుపై ఇప్పటికే కేసు నమోదైందని టిడిపి నేతలు సిఎం దృష్టికి తీసుకెళ్లారు.

అంతకుముందు గ్రామంలో ఫ్లెక్సీల తొలగింపు విషయమై ఈ నెల 7న సాయంత్రం తనకు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఫోన్ చేసి టిడిపి ఏజెంటుగా పనిచేస్తున్నావంటూ బెదిరించారని గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి దేవినేని ఉమాను ఏమైనా చేస్తామని, అవసరమైతే కడప నుంచి మనుషులను తెప్పిస్తామని మాట్లాడారని కార్యదర్శి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటూ ఆరా తీశారని.. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆడియో టేప్‌ను విని కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో ఈ వివాదంపై స్పందించిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తాను ఏ అధికారిని ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. హత్య రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. నందిగామలో హత్యా రాజకీయాలకు ఆజ్యం పోసింది దేవినేని కుటుంబమేనని ఆరోపించారు. గుంటుపల్లి ఈవో నరసింహారావుతో తనకు చనువు ఉందని, ఫ్లెక్సీల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఈవో దృష్టికి తీసుకెళ్లానని వసంత నాగేశ్వరరావు తెలిపారు. ఈవోను భయపెట్టినట్లు ఋజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో దేనికైనా సిద్ధమేనంటూ తాను సాధారణంగానే మాట్లాడానని వసంత నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications