పవన్ కళ్యాణ్‌ను ఎప్పుడూ చూడలేదు, బలవంత పెట్టొద్దు: ముద్రగడ

రాజమహేంద్రవరం: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదంటూ మరోసారి వ్యాఖ్యానించారు.

ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తనకు తెలియదని, ఎప్పుడూ చూడలేదని అన్నారు. కాపు ఉద్యమానికి రానివారిని బలవంత పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టిన దానితో తమ కడుపు నిండలేదని చెప్పారు.

I don't kno who is Pawan Kalyan: Mudragada

తమ కడుపు నిండేలా పెట్టాలని చెప్పారు. తద్వారా రిజర్వేషన్లపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు ఐదు శాతం సరిపోవని అభిప్రాయపడ్డారు. మార్చి 31వ తేదీ వరకు చంద్రబాబుకు డెడ్ లైన్ విధిస్తున్నట్లు చెప్పారు. రిజర్వేషన్లు అమలు చేయకుంటే మళ్లీ పోరాటం స్తామన్నారు.

తెలుగుదేశం పార్టీ నేత, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు కూడా గతంలో తనకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని మాట్లాడారు. అయితే దానికి ఆ తర్వాత పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తకు అశోక్ గజపతి రాజు మాత్రం తెలుసునని ఓ సందర్భంలో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+