ఆయనెవరో తెలియదు: పవన్ కళ్యాణ్‌పై అశోక్ గజపతిరాజు సంచలనం
పశ్చిమగోదావరి: ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదంటూ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చారు. ఆ తర్వాత విర్డ్స్ ఆస్పత్రిలో ఆర్థోస్కోపీ యంత్రాలను ప్రారంభించారు.

పవన్ తెలియదు..
ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆయనెవరో నాకు ఐడియా లేదు. అందరూ అంటున్నారు ఎవరో సినిమావాడట.. నేను సినిమాలు చూసి చాలా ఏళ్లైంది. సినిమాల గురించి మాట్లాడితే నేనేం చెప్పను' అని పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అశోక్ గజపతి రాజు అసహనం
టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారిని నియమించడంపై పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఆయన అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు.

హర్షనీయం
గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా కేంద్రం ప్రభుత్వం గుర్తించడం హర్షనీయమని అశోక్ గజపతి రాజు అన్నారు. ఇటీవేల గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా కేంద్రం గుర్తించిన విషయం తెలిసిందే.

ఉత్తరాదిపై ప్రశ్నించిన పవన్
ఉత్తరాది ఐఏఎస్ అధికారిని టీటీడీ ఈవోగా నియమించడాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఉత్తరాది ఆలయాలకు దక్షిణాది అధికారులను నియమిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాది వ్యక్తిని టీటీడీ ఈవోగా నియమించడంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని పవన్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications