నా తండ్రి వద్ద కామధేనువు లేదు, సత్తా లేదు: రాజకీయం నేర్చిన పవన్ కళ్యాణ్

విశాఖపట్నం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ పట్టేశారని అంటున్నారు. తన విశాఖపట్నం పర్యటనలో ఆయన వ్యాఖ్యలు చూస్తేనే అర్థమవుతున్నాయని అంటున్నారు. పవన్ రాజకీయం నేర్చారని, నాయకుడిగా పరిపక్వత సాధించారని అంటున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాల కార్యకర్తల సమావేశానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. తన ప్రసంగంలో ఆయన పదేపదే యువత, మహిళల గురించి ప్రస్తావించారు. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా యువతను, మహిళలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. పవన్ కూడా అదే ధోరణితో ముందుకు వెళ్లారు. యువత, మహిళల గురించి ప్రస్తావించారు.

 కొత్త రక్తం కావాలని పవన్ కళ్యాణ్

కొత్త రక్తం కావాలని పవన్ కళ్యాణ్

దేశ రాజకీయాల్లో కానీ, కొత్త రాజకీయ ఆలోచన ధోరణి ఉన్న కొత్త రక్తం కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. యువత, మహిళలు రాజకీయాల్లో ఇప్పటికే వచ్చి నిలదొక్కుకొని ఉంటే ప్రత్యేక హోదా సాధించేవారని చెప్పారు. ఇప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థ దోపిడీ చేసి కుళ్లి పోయిందన్నారు. అందుకే ఇన్ని సమస్యలు అన్నారు.

 మా నాన్న కామధేనువు పెట్టుకున్నారా

మా నాన్న కామధేనువు పెట్టుకున్నారా

ఫోన్ చేస్తే డబ్బులు ఇవ్వడానికి తన తండ్రి వద్ద ఏమైనా వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. లేదా తన తండ్రి ఏమైనా కామధేనువును పెట్టుకున్నారా అన్నారు. అడగ్గానే బంగారం ఎంతైనా ఇవ్వడానికి తమ వద్ద అతీత శక్తులు లేవని అభిప్రాయపడ్డారు.

 ఇవ్వడానికి మనసు ఉంది కానీ సొత్తు, సత్తా లేదు

ఇవ్వడానికి మనసు ఉంది కానీ సొత్తు, సత్తా లేదు

తన వద్ద ఇవ్వడానికి డబ్బులు, బంగారం లేదని చెప్పిన పవన్ కళ్యాణ్, కేవలం మనసు మాత్రమే ఉందని చెప్పారు. తనకు ఇవ్వాలనే మనసు ఉన్నప్పటికీ అంత సొత్తూ, సత్తా తన వద్ద లేదన్నారు.

 ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తారంట అని వక్రీకరించారు

ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తారంట అని వక్రీకరించారు

జనసేన పార్టీ ప్రారంభించిన సందర్భంలో కార్యకర్తల ఎంపిక కోసం సీపీఎఫ్ అనే విధానాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు. అప్పుడు చాలామంది దానిపై విమర్శలు చేశారన్నారు. ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తారంట అని దానిని చాలామంది వక్రీకరించారన్నారు. ఒక కొత్త రకం రాజకీయాల్లోకి వస్తే తప్ప వ్యవస్థ మారదనే ఉద్దేశ్యంతో తాను సీపీఎస్ విధానం ప్రవేశ పెట్టినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+