నాకు తెల్సు, ఒకరితో చెప్పించుకోను!: చిరు బృందంతో నరసింహన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఏపీ కాంగ్రెస్ నేతలతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. సోమవారం ఉదయం ఏపీ కాంగ్రెస్ నేతలు చిరంజీవి, రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ, పళ్లం రాజు తదితరులు గవర్నర్‌ను కలిసి తెలంగాణ వేసిన ట్యాక్స్, ఆంధ్రప్రదేశ్‌లోని కరువు పైన ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ వారితో ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. సమాచారం మేరకు... తాను ఏం చేశానో ప్రజలకు తెలుసునని, ఏం చేసినా ఆలోచించి నిజాయితీగా చేస్తానని ఆయన చెప్పారు. తాను రాజ్ భవన్‌లో ఖాళీగా కూర్చోనని వ్యాఖ్యానించారు.

ప్రజల కోసమే తాను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి మాట్లాడానని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజల సమస్యలు తనకు తెలుసునని చెప్పారు. ఏం చేసినా నిజాయితీగా చేస్తానని, ధర్మం, న్యాయం వైపు నిలబడతానని చెప్పారు.
ప్రజా సమస్యల పైన స్పందించిన మొదటి గవర్నర్‌ను తానేనని చెప్పారు. తాను అందరికంటే ఒక అడుగు ముందే ఆలోచిస్తానని చెప్పారు. మరొకరితో చెప్పించుకునే పరిస్థితిని తాను రానీయనని చెప్పారు. ప్రజా సమస్యలే పరిష్కారంగా తాను స్పందిస్తున్నానని, తానేం చేశానో ప్రజలకు తెలుసునని తెలిపారు.












Click it and Unblock the Notifications