నన్ను తాకలేరు: రేవంత్ ఇష్యూలో బాబు కౌంటర్

అనంతపురం: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఒకింత ఘాటుగా స్పందించారు. తాను ఎప్పుడు అవినీతి, లంచం రాజకీయాలకు పాల్పడలేదని, జగన్, తెరాస తనను టార్గెట్ చేసుకోవడం సరికాదన్నారు.

జగన్, కేసీఆర్‌లు కలిసి తెలుగుదేశం పార్టీని, తనను టార్గెట్ చేసుకున్నాయన్నారు. జగన్ పైన 16 కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తి తన పైన విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. జగన్ మొత్తం కేసుల్లో ఇరుక్కొని, తన పైన విమర్శలు చేయడమేమిటన్నారు.

చంద్రబాబు తన వ్యాఖ్యల ద్వారా జగన్, కేసీఆర్‌లతో పాటు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డికి కూడా కౌంటర్ ఇచ్చారని చెప్పవచ్చు. రేవంత్ కేసులో బాబు సూత్రధారి అని, ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని, చంద్రబాబును ముద్దాయిని చేయాలనే డిమాండ్ వినిపిస్తోందని నాయిని వ్యాఖ్యానించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వారంతా నేడు నీతులు వల్లిస్తున్నారని, 35 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ఎదిగిన తనపై వళ్లంతా మచ్చలున్న వారు విమర్శలు చేయడం సిగ్గుచేటని చంద్రబాబు తెరాస అధినేత కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్‌పై నిప్పులు చెరిగారు.

చంద్రబాబు

చంద్రబాబు

జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో భాగంగా బుధవారం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు, చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం ఆర్ మల్లవరం జరిగిన సభల్లో చంద్రబాబు ప్రసంగించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయ స్వార్థంతో కాంగ్రెస్ పార్టీ టిఆర్‌ఎస్‌తో కుమ్మక్కయి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిందన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఆ తర్వాత సమైక్యవాదం పాటపాడిన వైసీపీ నేత జగన్ తెరాసతో కలిసి రాష్ట్రంలో జరిగే అన్ని అభివృద్ధి పనులకు మోకాలడ్డే పనిలో పడ్డారన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమైక్యాంధ్ర కోసం పని చేసిన వైసీపీ, రాష్ట్ర విభజనకు కారకుడైన ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన తెరాసకు మద్దతు ఇవ్వడమే ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయనడానికి నిదర్శనమన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భూ స్థాపితం అయితే వైసీపీ అధినేత అవినీతి కేసుల్లో జైలు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రైతు భరోసా యాత్రలు, దీక్షల పేరుతో జనాన్ని మభ్య పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. అనంతపురం జిల్లాలో పది రోజుల పాటు రైతు భరోసా యాత్ర ఎందుకు చేశారన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తాజాగా ఇప్పుడు మరో దీక్ష చేపట్టారన్నారు. దీక్షలు, యాత్రలు ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు.

చంద్రబాబు

చంద్రబాబు

కలిసి పని చేసి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకందాం అని తాను కోరినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకరించడం లేదని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

పైగా విద్యుత్ ఇవ్వడం లేదంటూ తనపై కేసీఆర్ ఆరోపణలు చేసారన్నారు. చట్టంలో ఉన్న అన్నిటినీ తాను పాటిస్తానని, మీరు కూడా చట్టాన్ని అనుసరించి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇవ్వాలని కోరినా ఆయన స్పందించడం లేదన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

కేసీఆర్‌కు తోడు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, వైసీపీలు కూడా కలిసి రావడం లేదన్నారు. తాను మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ నిప్పులాగా బతికానని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఉద్వేగభరితంగా అన్నారు. ప్రజల ఆశీస్సులున్నంతవరకు తెలుగుదేశం పార్టీని తాకడానికైనా ఎవరికీ సాధ్యం కాదన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు


పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమకు నీళ్లిద్దామని తాను ప్రయత్నిస్తూ ఉంటే ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకుంటున్నాయన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

అయితే ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేసారు. రాజధాని లేని రాష్ట్రానికి ఒక అద్భుతమైన రాజధానిని నిర్మించడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు


అందులో భాగంగానే భూ సమీకరణ జరిపామని, రైతులు 33 వేల ఎకరాల భూములు స్వచ్ఛందంగా ఇస్తే దాన్ని కూడా విమర్శించడం విడ్డూరమన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు


రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని తాను కేంద్రాన్ని కోరుతానని చెన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నా ఇక్కడి వారు ఏ మాత్రం సహకరించడం లేదని, అయినా తాను వెనకడుగేసే ప్రసక్తే లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+