వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా మేమే చేశాం! బాబు-కేసీఆర్, ఉండవల్లి, సుజనాపై వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

BJP Leader Fires At TDP And Congress

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కట్టుబడి ఉన్నది తమ పార్టీనేనని భారతీ జనతా పార్టీ నేత సోము వీర్రాజు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు కాంగ్రెస్, టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని సోము వీర్రాజు అన్నారు. హోదా అంటే జైలుకేనంటూ చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అంతేగాక, అందుకు సంబంధించిన మీడియా కథనాలను చూపించారు.

బాబు చెప్పినవే చెబుతున్నా..

బాబు చెప్పినవే చెబుతున్నా..

ప్రత్యేక హోదాతో వచ్చేది రూ.3వేల కోట్లేనని, మనమే ఎక్కువ సాధించామని సీఎం చంద్రబాబు చెప్పారని సోము వీర్రాజు తెలిపారు. అలాంటి చంద్రబాబును ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. నాడు సీఎం చంద్రబాబు చెప్పినవే.. తాను ఇప్పటి వరకు చెబుతున్నానని సోము వీర్రాజు తెలిపారు. బీజేపీ నేతల్ని కాదు.. చంద్రబాబును మీడియా ప్రశ్నించాలని అన్నారు.

బాబు రెండు నాల్కల దోరణి

బాబు రెండు నాల్కల దోరణి

రాష్ట్ర విభజనలోనూ చంద్రబాబు రెండు నాల్కల దోరణి అవలంభించారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. తెలంగాణకు వెళ్లి తాను రాష్ట్రపతికి విభజన లేఖ ఇచ్చానని చెప్పి.. ఆంధ్రాకు వచ్చి సమన్యాయం కోసం పోరాడుతున్నామని చంద్రబాబు చెప్పారని వీర్రాజు దుయ్యబట్టారు. తమ పార్టీ ఎప్పుడూ రెండు విధాలుగా మాట్లాడలేదని అన్నారు. వాస్తవాల్ని ఒప్పుకునే పార్టీ అని చెప్పారు.

వెంకయ్య పోరాటం చేశారు

వెంకయ్య పోరాటం చేశారు

అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ గురించి ఆలోచించారు కానీ.. ఏపీ 13 జిల్లాల గురించి ఆలోచించారా? అని వీర్రాజు ప్రశ్నించారు. విభజన సమయంలో ఏపీకి ఏమీ కావాలో కాంగ్రెస్ గానీ, టీడీపీ గానీ అడగలేదని అన్నారు. వెంకయ్యనాయుడు రాజ్యసభలో ఏపీకి న్యాయం కావాలని పోరాటం చేశారని చెప్పారు. హోదా 15ఏళ్లు కావాలని వెంకయ్యే అడిగారని చెప్పారు.

ఉండవల్లి, లగడపాటి.. సుజనా, రమేష్‌లు ఏం చేశారు?

ఉండవల్లి, లగడపాటి.. సుజనా, రమేష్‌లు ఏం చేశారు?

కాంగ్రెస్ వాళ్లు బిల్లులో ఏం పెట్టారని ప్రశ్నించారు. ఏపీ కోసం టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు సభలో ఏం మాట్లాడారని వీర్రాజు నిలదీశారు. 14వ ఆర్థిక సంఘంలో ఏముందో అందరికీ తెలుసని అన్నారు. వెంకయ్యనాయుడే పోలవరం ముంపు మండలాల గురించి కూడా మాట్లాడారని అన్నారు. కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ పోలవరం ముంపు మండలాల గురించి బిల్లులో పెట్టించారా? అని సోము వీర్రాజు నిలదీశారు.

ఒక్క ఎమ్మెల్యే లేకున్నా ముంపు మండలాలు సాధించాం

ఒక్క ఎమ్మెల్యే లేకున్నా ముంపు మండలాలు సాధించాం

ఏపీలో ఒక్క శాసనసభ్యుడు కూడా లేని తమ పార్టీ పోలవరం ముంపు మండలాలను బిల్లులో పెట్టించి, ఏపీలో విలీనం చేసిందని వీర్రాజు చెప్పారు. తాను ఆధారాలతోనే మాట్లాడుతున్నానని సోము వీర్రాజు చెప్పారు. పోలవరం వద్దని ఓ టీడీపీ ఎంపీ వ్యాఖ్యానించినా సుజనా చౌదరి పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిందే బీజేపీనేనని అన్నారు.

కీలక పాత్ర పోషించా..

కీలక పాత్ర పోషించా..


పోలవరం కోసం తాను ఎంతో కృషి చేశానని, ముంపు మండలాల విషయంలో కీలక పాత్ర పోషించానని సోము వీర్రాజు తెలిపారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో మాట్లాడానని అన్నారు. నాటి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కూడా ఏపీ ప్రయోజనాలే మాకు ముఖ్యమని తాను తేల్చి చెప్పానని తెలిపారు. భద్రాచలంను కూడా ఏపీలో కలపాలని తాను డిమాండ్ చేశానని గుర్తు చేశారు.

 సోనియా కాళ్లపై కేసీఆర్ పడ్డారు

సోనియా కాళ్లపై కేసీఆర్ పడ్డారు

కానీ, కేసీఆర్, హరీశ్ రావులు విద్యుత్ ప్రాజెక్టులు, తదితర అంశాలతో భద్రాచలంను విడిచిపెట్టలేదని, మిగితా 7 మండలాలను ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించారని అన్నారు. అంతేగాక, సోనియా గాంధీ కాళ్ల మీద పడి భద్రాచలంను తెలంగాణలోనే ఉండేట్లు చూసుకున్నారని వీర్రాజు చెప్పారు. కాగా, భద్రాచలం గురించి మాట్లాడిన తనను పార్టీ నుంచి తొలగించాలని కొందరు తెలంగాణ నేతలు చూశారని చెప్పారు.

అన్నీ చేస్తున్నా విమర్శలా..?

అన్నీ చేస్తున్నా విమర్శలా..?

అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చి బీజేపీ తన చిత్తశుద్ది చాటుకుందని సోము వీర్రాజు తెలిపారు. పోలవరం, నదుల అనుసంధానం, సుజల స్రవంతితో వేల ఎకరాల పంటలు సాగులోకి వస్తాయని చెప్పారు. పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి 2022 వరకు టైముందని, కానీ, 2019లోనే పూర్తి చేయాలని అధికార టీడీపీ రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. రాజధాని అమరావతి కోసం ప్రధాని మోడీ పవిత్ర నదీ జలాలు తెస్తే మట్టి తెచ్చారని ప్రచారం చేశారని మండిడ్డారు. లక్ష కోట్లు ప్రకటిస్తామని మోడీ చెప్పారా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్ని విధాలా సాయం చేస్తున్న మోడీని విమర్శిస్తారా? అంటూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పై మండిపడ్డారు. కేంద్రం అనుమతితోనే పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. తాము చేస్తున్నది చెప్పుకోనివ్వరా? అంటూ నిలదీశారు.

English summary
BJP leader Somu Veerraju on Friday said that he played key role in polavaram project issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X