నల్లగా ఉన్నానని హేళన చేశారు -రంగు పూసి అందంగా -జయలలితే స్ఫూర్తి: వైసీపీ ఎమ్మెల్యే రోజా
అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ, జిల్లాలో తన మాటకు విలువ లేకుండా పోయిందని, సొంత పార్టీ నేతలు, అధికారులు అడగుగడుగునా అవమానిస్తున్నారంటూ ఇటీవల కన్నీటిపర్యంతమైన నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా తన బాధను అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి కూడా విన్నవించుకున్నారు. పొలిటికల్ కెరీర్ లోనేకాదు.. గతంలో తాను పనిచేసిన సినీ రంగంలోనూ పలు చేదు అనుభవాలను చవిచూసినట్లు ఆమె తాజాగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా శరీరం రంగు విషయంలో కామెంట్లు ఎదుర్కొన్నానని తెలిపారు.

బ్యూటీ అకాడమీ ప్రారంభోత్సవం..
సౌత్ ఇండియా సినీ,టీవీ మేకప్ ఆర్టిస్ట్-హెయిర్ స్టైలిస్ట్ యూనియన్ ఆధ్వరంలో చెన్నై నగరంలోని విరుగంబాక్కంలోని ఏవీఎం కాలనీ, కామరాజర్ శాలైలో నెలకొల్పిన హెచ్‌జే సినీ మేకప్ హెయిర్, బ్యూటీ అకాడమీని మంత్రి కడంబూరు రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. హెచ్‌జే సినీ మేకప్ హెయిర్ అండ్ బ్యూటీ అకాడమీని మంత్రితో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..

నల్లగా ఉన్నానని కామెంట్లు..
సినీపరిశ్రమకు వచ్చిన కొత్తలో నల్లగా ఉన్నారు.. ఎలా సినిమాల్లో రాణిస్తారంటూ ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేసేవారన్నారు. కానీ, మేకప్‌మెన్స్ తనకు కాస్త రంగువేసి... మరింత అందంగా చూపించారని రోజా గుర్తుచేశారు. మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్టుల కారణంగానే తాను వెండితెరపై అందంగా కనిపించానని చెప్పారు. కోలీవుడ్(తమిళ సినీ పరిశ్రమ) తనకు పుట్టినిల్లు లాంటిదన్న రోజా.. సాధారణంగా మన ఇంట్లో జరిగే శుభకార్యాలకు తొలుత ఇంటి ఆడపడుచుతో దీపం వెలిగాస్తారన్నారు. అలా, తనను అకాడెమీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించి, జ్యోతి ప్రజ్వలన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంకా..

జయలలితే నాకు స్ఫూర్తి..
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనకు స్ఫూర్తి అని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, సినీ నటి ఆర్‌కే రోజా పేర్కొన్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత అనేక ఇబ్బందులు, ఎత్తుపల్లాలను చవిచూశానని చెప్పారు. అలాంటి సమయంలో తలైవి జయలలితను తలచుకుంటే, తనలో కొండంత ధైర్యంతో పాటు ఎక్కడలేని ఆత్మవిశ్వాసం కలిగేదన్నారు. ఈ కార్యక్రమంలో రోజా భర్త, ఫెప్సీ అధ్యక్షుడు కూడా అయిన దర్శకుడు ఆర్.కె.సెల్వమణి సహా పలువురు పాల్గొన్నారు.
-
తమిళ సాంగ్‌లో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టిన రోజా! వీడియో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications