అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, ఓడినా పర్లైదు, నేను కూలి పని చేస్తా: పవన్

|
Google Oneindia TeluguNews

అనంతపురం: తాను హైదరాబాద్ తర్వాత అనంతపురంలోనే జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తానని, వచ్చే ఎన్నికల్లో (2019) ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆ పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు చెప్పారు. అనంతపురంలో సీమాంధ్రుల హక్కుల చైతన్య వేదిక సభలో ఆయన మాట్లాడారు.

తాను ఇప్పటి దాకా హైదరాబాదులో జనసేన సభ కార్యాలయాన్ని పెట్టానని చెప్పారు. అనంతపురంలో ఇప్పుడు ప్రారంభిస్తానని చెప్పారు. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. ఓటు వేయండి, వేయక పోండి నేను మాత్రం పోటీ చేస్తానని చెప్పారు.

గెలుస్తానా, ఓడిపోతానా అనే దానితో సంబంధం లేకుండా నేను రాయలసీమ తరఫున పోరాటం చేస్తానని చెప్పారు. రాయలసీమ బాధలను ఢిల్లీ దాకా తెలియచేస్తానని చెప్పారు.

I will contest in 2019 elections: Pawan Kalyan

నేను ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఆ తర్వాత గెలిస్తే అనంతపురం కరువును, సమస్యలను ఢిల్లీ దాకా తీసుకు వెళ్తానని చెప్పారు. కరువు వల్ల ఆడపడుచులు మానాలను అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ భూమి ఉండి నీరు లేక వెళ్లిపోతున్న వారు ఎందరో ఉన్నారన్నారు.

శ్రీశ్రీ జగన్మోహన్.., శత్రువునే: పవన్ కౌంటర్, చంద్రబాబుకు '2' హెచ్చరికలు శ్రీశ్రీ జగన్మోహన్.., శత్రువునే: పవన్ కౌంటర్, చంద్రబాబుకు '2' హెచ్చరికలు

నాకు శక్తి ఉంటే కరువు కోసం ఏదైనా చేసేవాడినని చెప్పారు. అనంత కరువుపై పలువురితో మాట్లాడానని చెప్పారు. నేను నటుడినే కాకుండా రైతు బిడ్డను, రైతును కూడా అన్నారు. నేను పొలం పనులు చేస్తానని చెప్పారు. కూలి కూడా చేస్తానని చెప్పారు.

తాగునీటి అవసరాలకు ఓ సత్యసాయి బాబా రావాలా అని ప్రశ్నించారు. ఇక్కడి వారి అవసరాలు తీర్చేందుకు స్పెయిన్ నుంచి రావాలా అన్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి రావాలా అని ప్రశ్నించారు.

తన సినిమాలు ఆడవచ్చు, ఆడకపోవచ్చు కానీ ప్రజల సమస్యలపై పోరాటం, వారికి అండగా నిలబడినప్పుడే తనకు చాలా సంతోషమని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో పుట్టకపోయినా ఇక్కడి వారికి అండగా ఉంటానని చెప్పారు. అందుకే ఏపీలోని అనంతపురం నుంచి నా జనసేన పార్టీని ప్రారంభిస్తానని చెప్పారు.

ఎవరెవరో వచ్చారు, ఏం చేసారో నాకు తెలియదు కానీ మీ వాడిగా, మీ బిడ్డగా జిల్లా సమస్యలపై, కరువుపై పోరాడుతానని చెప్పారు. నేను మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చెప్పడం లేదని, గుండె లోతుల్లో నుంచి మాట్లాడుతానని చెప్పారు. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. తనకు ఏ పార్టీ పైన వ్యతిరేకత లేదన్నారు.

English summary
Jana Sena party chief Pawan Kalyan speech in Public Meeting at Anantapur on Thursday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X