మళ్లీ పోటీ చేస్తా, తీరు మార్చుకోకుంటే: జయసుధ వార్న్

ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తన సేవలను ఇతర అవసరాలకు వినియోగించుకోదలిస్తే తప్ప రానున్న ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండే మరోసారి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొందరు వ్యక్తులు ప్రవర్తిస్తున్నారని, వారు తమ వ్యవహారశైలిని మార్చుకోకుంటే తాను తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తన ఫ్లెక్సీలను, బ్యానర్లను తొలగిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇది సరికాదని జయసుధ అన్నారు.
కాగా, కొద్ది రోజుల క్రితం జయసుధ రాజకీయాలపై వైరాగ్యం ప్రదర్శించిన విషయం తెలిసిందే. రాజకీయాల పట్ల తన అసంతృప్తిని ఆమె వ్యక్తం చేయడంతో వచ్చే ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటారేమోనని కొందరు భావించారు. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి సికింద్రాబాదు నుండి పోటీకి సిద్ధమని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications