వచ్చే ఎన్నికల్లో నేనేంటో చూపిస్తా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

మీరు ఎం చేస్తారో తెలియదు గానీ, వచ్చే ఎన్నికల్లో మాత్రం లక్ష మెజారిటీకి ఒక్క ఓటు కూడా తగ్గినా ఊరుకునేది లేదని జగ్గారెడ్డి పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. సంగారెడ్డిలో మనకంటూ ప్రత్యర్ధులు లేరని, ఏజెంట్లు కూడా ఎవరూ ఉండరని కార్యకర్తలకు జగ్డారెడ్డి వారికి తెలిపారు. అంతేగాక వచ్చే ఎన్నికల్లో లక్ష మెజారిటీకి తగ్గినట్టయితే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది.
రాష్ట్రంలో సంగారెడ్డి అంటే ఏమిటో చూపిస్తానని జగ్గారెడ్డి అన్నారు. కాగా ఇటీవల మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ భార్య పద్మిని సంగారెడ్డి నియోజక వర్గంలో పర్యటించారని, ఆమె కూడా సంగారెడ్డిలో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఆమె కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. సంగారెడ్డిలో పోటీ చేస్తారని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కాగా జగ్గారెడ్డి బూతులు క్యాప్చరింగ్‌కు పాల్పడాలని చేసిన వ్యాఖ్యలు యాధృచ్ఛికంగా చేసిన వ్యాఖ్యలని ఆయన అనుచరులు తెలిపారు.












Click it and Unblock the Notifications