జేసీ మనసులో మాట: బీజేపీలో చేరతా..? కానీ కండీషన్, జాతీయ పార్టీలతోనే రాష్ట్రాల ..
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు టీడీపీలో ఉంటానంటునే.. బీజేపీలో చేరే అవకాశం కూడా ఉందని సిగ్నల్స్ ఇచ్చారు. కానీ అందుకు అంటూ.. షరతు విధించారు. ఇవాళ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో జేసీ దివాకర్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్‌లో ఇష్యూ జరిగిన మరుసటి రోజే బీజేపీ నేతను జేసీ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కిషన్ రెడ్డితో భేటీ..?
సత్యకుమార్‌తో వివిధ అంశాలపై జేసీ దివాకర్ రెడ్డి చర్చించారు. అమరావతిలోనే ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని సోమవారం జేసీ భేటీ అయ్యే అవకాశం ఉంది. వరసగా బీజేపీ నేతలతో జేసీ మీటవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ప్రాంతీయ పార్టీలు ఉన్నంతవరకు తాను టీడీపీలోనే ఉంటానని జేసీ స్పష్టంచేశారు. అయితే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాత్రం జాతీయ పార్టీలే కీలకమని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పీవోకేనే ఆక్రమిస్తే..
తాను పార్టీ మారబోనని.. ఒకవేళ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ స్వాధీనం చేసుకుంటే.. బీజేపీలో చేరతానని ప్రకటించారు. 70 ఏళ్లలో కానీ కశ్మీర్ విభజన చేసిన మోడీ-అమిత్ షా ద్వయం.. పీవోకే కూడా తీసుకొస్తే బీజేపీలో చేరే తొలి వ్యక్తిని తానేనని చెప్పారు. అప్పుడు జాతీయ పార్టీల ప్రాధాన్యం పెరిగిపోతుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలకు ఆశించినస్థాయిలో ఆదరణ ఉండదని అభిప్రాయపడ్డారు.

హైటెన్షన్
శనివారం అనంతపురం రూరల్ పోలీసుస్టేషన్ వద్ద హైటెన్షన్ నెలకొన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తానని చేసిన కామెంట్లపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం వెళ్లారు. అయితే పోలీసులు ష్యూరిటీ అంటూ పీఎస్‌లోనే ఉంచిన సంగతి తెలిసిందే.

8 గంటలు పీఎస్‌లోనే..
దాదాపు 8 గంటలపాటు కూర్చొబెట్టడంతో తాడిపత్రి నుంచి జేసీ అనుచరులు రావడం, ఒకరు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొనే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తర్వాత జేసీనీ పోలీసులు వదిలేయడంతో.. తానేమన్నా దేశద్రోహినా అంటూ విరుచుకుపడ్డారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications