త్వరలోనే టిటిడి బోర్డు పాలకవర్గం నియామకం: చంద్రబాబు

తిరుపతి: త్వరలోనే టిటిడి పాలకమండలిని నియమించనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆదివారం నాడు ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారిని సందర్శించుకొన్నారు.

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని చంద్రబాబునాయుడు తన స్వగ్రామమైన నారావారిపల్లెకు శనివారం రాత్రి చేరుకొన్నారు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబునాయుడు జరుపుకోనున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబునాయుడు కూడ నారావారిపల్లెకు చేరుకొన్నారు.

I will nominate TTD board soon, says Chandrababu naidu

ఆదివారం ఉదయం బోగిమంటలు వేసి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆఆయన సతీమణి భువనేశ్వరి, హీరో బాలకృష్ణ దంపతులు, మంత్రి లోకేష్ దంపతులు తదితరులు తిరుమలకు వచ్చారు.

తిరుమలకు వచ్చిన సీఎం బంధుమిత్రులకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తరువాత తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనాలు పలికారు.త్వరలోనే టిటిడి పాలకమండలి నియమిస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించినట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+