పోటీపై తేల్చేసిన బూచేపల్లి: ఆ నిర్ణయంతో షాక్‌లో వైసీపీ, జగన్ ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

ఒంగోలు: 2019 ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తాను పోటీ చేయబోనని మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయమై గతంలోనే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పార్టీ చీఫ్ వైఎస్‌ జగన్‌కు తేల్చి చెప్పారు. అయితే పార్టీ నాయకత్వం ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్టు ప్రచారం సాగింది. కానీ, పోటీ చేయబోనని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్పష్టత ఇచ్చారనే ప్రచారం సాగుతోంది.

ప్రకాశం జిల్లాలోని దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని బూచేపల్లి కుటుంబం నిర్ణయం తీసుకొంది.ఈ విషయమై బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల కాలంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు.

జగన్‌కు షాక్: బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఫ్యామిలీ రాజకీయాలకు గుడ్‌బై?

అయితే ఈ విషయమై పార్టీ నేతలు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో చర్చించినా ప్రయోజనం లేకపోయిందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంలో గతంలో తాను తీసుకొన్న నిర్ణయానికే కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించారనే ప్రచారం సాగుతోంది.

2019 ఎన్నికల్లో పోటీకి దూరం

2019 ఎన్నికల్లో పోటీకి దూరం

2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండాలనే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్పష్టత ఇచ్చారంటున్నారు. దర్శి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తన నిర్ణయంలో మార్పులేదని మరోసారి స్పష్టత ఇచ్చారు. తాను పోటీ చేయబోనని జగన్‌కు చెప్పిన బూచేపల్లిపై నియోజకవర్గంలోని అనుచరుల నుంచి ఒత్తిడి వచ్చింది. దీంతో ఆయన మెత్తబడ్డారని, నిర్ణయం మార్చుకోవచ్చని కొందరు భావించారు. కానీ, పోటీకి దూరంగానే ఉండాలనే నిర్ణయంలో మార్పులేదని బూచేపల్లి స్పష్టత ఇచ్చారంటున్నారు.

అందుకే పల్లెనిద్రకు దూరమా?

అందుకే పల్లెనిద్రకు దూరమా?


2019 ఎన్నికల్లో పోటీ విషయమై ఇటీవల వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో ఇటీవల చర్చించారు. అయితే పోటీకి దూరంగా ఉండాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి స్పష్టం చేశారని సమాచారం. ఈ కారణంగానే బూచేపల్లి శివప్రసాద్ ‌రెడ్డి పల్లె నిద్రకు దూరంగా ఉన్నారు.

దర్శిలో ప్రారంభం కాని పల్లెనిద్ర

దర్శిలో ప్రారంభం కాని పల్లెనిద్ర

ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో పల్లె నిద్ర కార్యక్రమం ప్రారంభం కాలేదు. బూచేపల్లి నిర్ణయంపై మరింత స్పష్టత వచ్చినందున త్వరలోనే అక్కడ కొత్త సమన్వయ కర్తను నియమించవచ్చని పార్టీ నాయకులు భావిస్తున్నారు.అయితే ఇప్పటికే కొందరు నేతల పేర్లను దర్శి నియోజకవర్గ ఇంఛార్జీ విషయమై పార్టీ నాయకత్వం పరిశీలిస్తోందని సమాచారం.

ఎర్రగొండపాలెం నుండి సురేష్ పోటీ

ఎర్రగొండపాలెం నుండి సురేష్ పోటీ


2019 ఎన్నికల్లో సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్‌ తన సొంత నియోజకవర్గమైన ఎర్రగొండపాలెం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అందుకు జగన్‌ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఆ నియోజకవర్గంలోని వ్యవహారాలకు ప్రాధాన్యం ఇస్తున్న సురేష్‌ పల్లె నిద్రను కూడా అక్కడే చేపట్టారు.సంతనూతలపాడులో సామాన్య కిరణ్‌ అనే నాయకురాలిని రంగంలోకి దించేందుకు వైసీపీ అధి ష్ఠానం సిద్ధమైంది

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I will not contest from Darsi Assembly segment in 2019 elections said former Mla Buchepalli sivaprasad reddy. This rumour spreading in Ongole district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి