వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరెక్కడోనా, తూచ్!: విశాఖను వదలనన్న పురంధేశ్వరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Purandeswari
విశాఖ: తాను విశాఖ నుండి కాకుండా మరోచోటి నుండి పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మంగళవారం కొట్టి పారేశారు. పురంధేశ్వరి విశాఖ జిల్లాలో రెండు కొత్త రైళ్లను ఉదయం ప్రారంభించారు. విశాఖ-జోద్‌పూర్, విశాఖ- గాంధీగాం వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పురందేశ్వరి పచ్చజెండా ఊపారు.

ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని మంత్రుల బృందాన్ని (జివోఎం)ను కోరినట్లు చెప్పారు. ప్రజల మన్ననలు, ఆశీర్వాదం, ప్రోత్సాహం ఉన్నంత వరకు తాను విశాఖలోనే ఉంటానని చెప్పారు. తాను విశాఖ కాకుండా మరెక్కడో ఉండే ప్రసక్తి లేదన్నారు.

రాష్ట్రపతిని అవమానించడం: రాఘవులు

రాష్ట్ర విభజన విషయంలో శాసన సభలో చర్చించి అభిప్రాయం పంపాలని, బిల్లు పంపితే అసమగ్రంగా ఉందని వెనక్కి రప్పించుకోవాలని ప్రధాన పార్టీల నేతలు రాష్ట్రపతిని కోరడం ఆయనను అవమానించడమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు గుంటూరు జిల్లాలో అన్నారు.

శాసన సభలో సానుకూల, వ్యతిరేక అభిప్రాయాలపై నిష్పక్షపాతంగా చర్చించి తమ మనోగతాన్ని రాష్ట్రపతికి తెలియజేయాలన్నారు. కాంగ్రెసు పార్టీ నాటకీయతను ప్రదర్శిస్తూ ప్రజలను గందరగోళ పరుస్తోందని విమర్శించారు.

English summary
Union Minister Daggubati Purandeswari on Tuesday said she will not leave Vishakapatnam in 2014 general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X