మళ్లీ..సీఎం అయిన తరువాతే సభలో అడుగు పెడతా : చంద్రబాబు సంచలన నిర్ణయం : అసెంబ్లీలో ప్రకటన..!!
టీడీపీ అధినేత..ప్రతిపక్ష నేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండున్నారేళ్లుగా ప్రభుత్వం తనను వేధిస్తోందని..తన కుటుంబ సభ్యుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేసారు. సభలో మాట్లాడుతూ కంట తడి పెట్టారు. తనను ఏమన్నా తాను భరించానని.. ప్రజల కోసం విమర్శలు - ఆరోపణలు చేసుకుంటామని చెబుతూనే.. చేతులు జోడించి తన పైన వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యాల పైన మాట్లాడారు. అంతకు ముందు సభలో వ్యవసాయం పైన చర్చ జరుగుతున్న సమయంలో హెరిటేజ్ మీదకు చర్చ మళ్లింది. ఆ సమయంలో చంద్రబాబు మాట్లాడే ప్రయత్నం చేసారు.

తన కుటుంబ సభ్యల పైన వ్యాఖ్యలు చేసారంటూ
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతుండగా.. టీడీపీ ఎమ్మెల్యేలు బాబాయి గొడ్డలి అంటూ నినాదాలు చేసారు. దానికి స్పందించిన అంబటి రాంబాబు స్పందిస్తూ హత్యల గురించి మాట్లాడాలంటే వంగవీటి రంగా.. ఎలిమినేటి మాధవరెడ్డి హత్యల గురించి మాట్లాడాలంటూ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఆ వెంటనే సభ నుంచి వెళ్లి టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసారు. మండలిలో ఉన్న యనమల..లోకేశ్ ను పిలిపించారు.

సీఎం అయ్యే వరకూ తిరిగి అడుగు పెట్టనంటూ
సభలో తన సతీమణి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ కన్నీరు పెట్టుకున్నారు. తాను ఇక, ఈ సభలో కాలు పెట్టనని ప్రకటించబోతున్నట్లుగా వారితో చెప్పారు. ఆ వెంటనే సభలోకి వచ్చి...ఉద్వేగ పూరితంగా మాట్లాడుతూ ఇక, సభలో తాను సీఎం అయ్యే వరకూ కాలు పెట్టనంటూ చెబుతూ.. రెండు చేతులు జోడిస్తూ మాట్లాడారు. తన ఇంట్లో మహిళలను అవమానించటం భరించలేకపోతున్నానంటూ సభ నుంచి నిష్క్రమించారు.

చంద్రబాబు కన్నీరు అదుపు చేసుకుంటూ...
కుప్పంలో తాము ఓడిపోయామని..హేళన చేసినా తాము భరించామన్నారు. ఇక సభలో ఏ రకంగా వ్యవహరించాలనే అంశం పైన లోకేశ్.. యనమల తో పాటుగా పార్టీ ఎమ్మెల్యలతో చర్చించారు. సభలోకి వచ్చి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. ఆ సమయంలో తన ఇంటి మహిళలను అగౌర పరిచేలా వ్యవహరించారంటూ సభలో ఉద్వేగ భరితంగా మాట్లాడారు. మధ్యలోనే చంద్రబాబున మాట్లాడుతుండగా మైక్ కట్ అయింది. దీంతో..చంద్రబాబు తాను ఇక సభలోకి రానని.. సీఎం అయిన తరువాతనే వస్తానంటూ సభ నుంచి వెళ్లిపోయారు.

వైసీపీ మంత్రుల ఎదురు దాడి...
చంద్రబాబు ప్రకటన చేసిన మంత్రులు స్పందించారు. చంద్రబాబు మైక్ లేకుండా జగన్ కుటుంబ సభ్యుల గురించి వ్యాఖ్యలు చేసారని..వాటిని పరిశీలించాలని మంత్రి అప్పలరాజు వ్యాఖ్యానించారు. మరో మంత్రి కొడాలి నాని ఇదంతా ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే జరిగిందని చెప్పుకొచ్చారు. గతంలో జయలలిత.. ఏపీలో జగన్ ఇదే విధంగా శాసనసభ నుంచి వెళ్లి సీఎంలు అయ్యారని గుర్తు చేసారు. చంద్రబాబు క్షణికావేశంలో నిర్ణయం తీసుకోరని..కేవలం సానుభూతి కోసమే ఈ రకంగా చేస్తున్నారంటూ మండిపడ్డారు. తన ఇంటి మహిళలను తానే అల్లరి చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications