చంద్రబాబు ఆంధ్రాబాబే: పది రోజుల్లో రాజీనామా చేస్తానన్న కడియం

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి సిఎం చంద్రబాబునాయుడుపై తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి మంగళవారం ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎప్పటికీ ఆంధ్రాబాబేనని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కాలం చెల్లినట్లేనని అన్నారు.

ఏసిబి పారదర్శకంగా వ్యవహరిస్తోందని అన్నారు. చట్టానికి లోబడి చంద్రబాబుపై ఏసిబి కేసు నమోదు చేయాలని కోరారు. తన ఎంపి పదవికి 10 రోజుల్లోగా రాజీనామా చేస్తామని చెప్పారు. రెండు రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడియం శ్రీహరి విజయం సాధించిన విషయం తెలిసిందే.

అంతకుముందు వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో వరంగల్ జిల్లా ప్రజలు చేసిన ఉద్యమం చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. కేసీఆర్ చచ్చుడో... తెలంగాణ వచ్చుడో అని సీఎం కేసీఆర్ కాకతీయ యూనివర్సిటీలో ప్రతినబూనారని గుర్తు చేశారు.

I will resign to my MP post in 10 day says Kadiyam

రాయినిగూడెంలో కిరణ్‌కుమార్‌రెడ్డికి, మానుకోటలో జగన్‌కు జిల్లా ప్రజలను తెలంగాణ పోరాటం రుచి చూపించారని చెప్పారు. అమరుల త్యాగం వెలకట్టలేనివని, సీఎం కేసీఆర్ అకుంటిత దీక్షతో తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు అడుగులు వేస్తున్నారని తెలిపారు.

విద్యుత్ ప్లాంట్ పైలాన్ పనులను పరిశీలించిన మంత్రి జగదీష్

నల్గొండ జిల్లా దామెరచర్ల మండలంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పర్యటించారు. వీర్లపాలెంలో విద్యుత్ ప్లాంట్ పైలాన్ పనులను మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపి గుత్తా పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటులో భూములు కోల్పోయిన బాధితులతో మంత్రి సమావేశమయ్యారు. భూములు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+