వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం చెప్తారు: మౌనం వీడనున్న పవన్ కళ్యాణ్, సస్పెన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో మౌనం వీడనున్నారు. ఇది అందరిలోను ఉత్కంఠను రేపుతోంది. రెండు రోజుల క్రితం జనసేన ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నామని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ఆ ప్రకటన సారాంశం. అంతకుముందు కూడా పార్టీకి గుర్తింపు వచ్చాక పవన్ మాట్లాడుతారని ప్రకటన విడుదలయింది.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారోనని, ఎప్పుడు గుర్తింపు వస్తుందోనని అందరిలో.. ముఖ్యంగా అభిమానులు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ పత్రికా ప్రకటనలు విడుదలవుతున్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనే చర్చ సాగుతోంది.

సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి, టీడీపీకీ మద్దతు ప్రకటించారు. ఆ పార్టీల తరఫున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విస్తృత పర్యటనలు చేశారు. ఆ పార్టీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన మద్దతిచ్చిన పార్టీల పాలన పైన పవన్ ఏం చెబుతారనే చర్చ సాగుతోంది. మరోవైపు పవన్ నిప్పులు చెరిగిన తెరాస తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దీని పైన ఏం మాట్లాడుతారోనని చర్చించుకుంటున్నారు.

 పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో మౌనం వీడనున్నారు! పార్టీకి గుర్తింపు వచ్చాక ఆయన ఏం మాట్లాడుతారనే ఉత్కంఠ చాలామందిలో కనిపిస్తోంది.

 పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ స్థాపించిన పవన్.. సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తారని భావించారు. కానీ ఆయన అనూహ్యంగా టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికారు.

తెలుగుదేశం పార్టీకి చేయూత

తెలుగుదేశం పార్టీకి చేయూత

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ తరఫున జోరుగా ప్రచారం చేశారు. ఏపీ, తెలంగాణల్లో ఆ పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు.

 బీజేపీకీ మద్దతు

బీజేపీకీ మద్దతు

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ తరఫున జోరుగా ప్రచారం చేశారు. బాబు, మోడీలతో కలిసి ప్రచార సభల్లో పాల్గొన్నారు.

కేసీఆర్‌పై ధ్వజం

కేసీఆర్‌పై ధ్వజం

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, నేటి తెలంగాణ సీఎం కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు.

English summary
Pawan Kalyan warns imposters against misusing his name. Irked that some miscreants are misusing his name to collect money for Andhra Pradesh,while some others are running him down for silence, actor Pawan Kalyan has clarified that he is awaiting political approval.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X