చంద్రబాబు క్లాస్ తీసుకోలేదు, స్నేహం గొప్పదని మరోసారి రుజువైంది: ఎంపీ శివప్రసాద్

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరుపతి: స్నేహం మరోసారి గొప్పదని రుజువైందని చిత్తూరు ఎంపీ ఎన్ శివప్రసాద్ చెప్పారు.టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు తాను స్నేహాపూరితమైన వాతావరణంలో మాట్లాడుకొన్నట్టు ఆయన చెప్పారు.

తిరుపతిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై బాబు సీరియస్ అయ్యారు.

Iam explained to Chiefminister Chandrababunaidu on 269 G.O.:Sivaprasad.

ఈ విషయమై మీడియాలో పలు వార్తలు వచ్చాయి. శివప్రసాద్ పై చర్యలు తీసుకొంటారనే ప్రచారం కూడ సాగింది,శివప్రసాద్ వైసీలో చేరుతున్నారనే ప్రచారం కూడ సాగింది. అయితే ఈ వార్తలకు తెరదించుతూ సోమవారం నాడు శివప్రసాద్ బాబును కలిశారు.

చంద్రబాబుతో కలిసిన తర్వాత శివప్రసాద్ మంగళవారం నాడు తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్నేహాపూర్వకవాతావరంణంలో మాట్లాడుకొన్నట్టు చెప్పారు.

269 జీవో గురించి తాను ముఖ్యమంత్రికి వివరించినట్టు ఆయన చెప్పారు. తనకు చంద్రబాబునాయుడు క్లాస్ తీసుకొన్నారని చెప్పడం సరైందికాదన్నారు శిపప్రసాద్. స్నేహం గొప్పదని మరోసారి రుజువైందన్నారు శివప్రసాద్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Iam explained to Chiefminister Chandrababunaidu on 269 g.o said Chittoor Mp Sivaprasad on Tuesday at Tirupati.On Monday he met Chandrababunaidu at Amaravati.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి