జనసేనలో చేరుతానని చెప్పలేదు, పవన్ అలా చేస్తేనే సక్సెస్: ముద్రగడ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:జనసేన పార్టీలో తాను చేరుతానని చెప్పలేదని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.ఈ మేరకు ఆయన ఓ లేఖను ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు రాశారు.ఆ లేఖ ప్రతిని మీడియాకు విడుదల చేశారు.

ఈ మేరకు ముద్రగడ పద్మనాభం ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఉద్దేశించి రాసిన లేఖలో ఈ విషయాన్ని ముద్రగడ పద్మనాభం ప్రస్తావించారు.

తన అభిప్రాయాలను జనసేన నాయకుడు రాఘవయ్య చర్చించినట్టు ముద్రగడ పద్మనాభం ఆ లేఖలో ప్రస్తావించారు. అంతేకాదు తాను జనసేన పార్టీలో చేరుతున్నట్టు ఎక్కడ ప్రకటించలేదని ఆయన గుర్తు చేశారు.

Iam not interested to join in Janasena says Mudragada padmanabham

పవన్ కళ్యాణ్ పూర్తి కాలం రాజకీయాల్లో ఉంటేనే ఆ రంగంలో మనుగడ సాధించే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. సినిమాలు, రాజకీయాలు అంటూ తిరిగితే రాజకీయాల్లో మనుగడ కష్టంగా మారే ప్రమాదం ఉందని ముద్రగడ పద్మానాభం చెప్పారు.

తన అభిప్రాయాలను జనసేన నేత రాఘవయ్యతో చర్చించానని ఆయన స్పష్టం చేశారు. అంత మాత్రానా తాను జనసేన పార్టీలో చేరుతున్నట్టు కాదని ఆయన గుర్తు చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభం కొంత కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాడు.

2014 ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో టిడిపి ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయమై బిసిలకు అన్యాయం జరగకుండా చూస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతుంది.ఈ విషయమై ఏపీ రాష్ట్ర అసెంబ్లీ కాపులకు రిజర్వేషన్ల విషయమై తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
kapu reservation agitation leader Mudragada Padmanabham said that I'm not interested to join in Janasena.He wrote a letter to Ap chief minister Chandrababuniadu on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X