జనసేన వైఖరి అర్ధం కాలేదు, కాంగ్రెస్ గెలిస్తే పునర్విభజన చట్టం అమలు: ఉండవల్లి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: జనసేన పార్టీ వైఖరి ఏమిటో తనకు అర్ధం కాలేదని రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో వైసీపీ, జనసేన‌లు కలిసి పోటీ చేసే అవకాశం లేదని తనకు అర్ధమైందని ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు.

  Undavalli Arun Kumar revealed interesting facts టిడిపి గెలుపు వెనుక: ఉండవల్లి షాకింగ్ | Oneindia

  సోషల్ మీడియాలో పవన్, జగన్ అభిమానుల తిట్ల యుద్దం, వెంకట్‌రెడ్డి అరెస్ట్, పోలీసుల నిఘా

  దేశంలో, రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులపై ఉండవల్లి అరుణ్‌కుమార్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులను ఆయన ప్రస్తావించారు.

  టార్గెట్ 2019: అనంతపురంలో జనసేన ఆఫీస్, టిడిపికి చెక్ పెట్టే ప్లాన్ ఇదే

  2019 ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్, బిజెపిల మధ్య పోటీ ఉండే అవకాశం ఉందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి గతంలో ఇచ్చిన హమీలను నెరవేర్చే అవకాశం లేకపోలేదన్నారు.

  జనసేన వైఖరి అర్ధం కాలేదు

  జనసేన వైఖరి అర్ధం కాలేదు

  జనసేన పార్టీ వైఖరి తనకు అర్ధం కాలేదని రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఏ పార్టీతో కలిసి పోటీ చేస్తోంది, ఏ పార్టీకి దూరంగా ఉంటుంది, ఏ పార్టీతో కలిసి ఉంటుందనే విషయమై స్పష్టత రాలేదని ఉండవల్లి చెప్పారు.

   వైసీపీకి పవన్ దూరం

  వైసీపీకి పవన్ దూరం

  .వైసీపీకి పవన్ దూరంగా ఉంటారనే సంకేతాలు ఇచ్చారని తనకు అర్ధమైందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఇటీవల ఏపీలో నిర్వహించిన సభల్లో పవన్ కళ్యాణ్ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ‌పై చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అదే అర్ధమౌతోందన్నారు ఉండవల్లి అరుణ్‌కుమార్.జగన్ కేసులను కూడ పవన్ ప్రస్తావించారని ఆయన గుర్తుచేశారు.జగన్‌పై కేసులున్న విషయాన్ని కూడ పవన్ కళ్యాణ్ ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు.

  బిజెపిని ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌కు ఉంది

  బిజెపిని ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌కు ఉంది

  బిజెపిని ఢీకొట్టే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందని ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్టు కన్పిస్తోందన్నారు.

  కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి లాభమే

  కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి లాభమే

  కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపర్చిన అన్ని అంశాలను కాంగ్రెస్ పార్టీ అమలు పర్చే అవకాశం ఉందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఇప్పుడు కన్పించడం లేదన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏపీకి ప్రయోజనం కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Iam unable to understand of Janasena party stand in 2019 elections said Rajahmundry former MP Undavalli Arun kumar on wednesday. A Telugu news channel interviewed him .

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి