పార్టీ పెట్టే ఉద్దేశ్యం లేదు, కాపులకు రిజర్వేషన్ల సాధనే ద్యేయం:ముద్రగడ
కాపు రిజర్వేషన్ల ఉద్యమ కారుడు ముద్రగడ పద్మనాభం కొత్త పార్టీ ఏర్పాటు విషయమై స్పందించాడు.తనకు పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశ్యమే లేదన్నారు.తన జాతికి కోసమే తాను పనిచేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.
కడప:తనకు కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ఉద్దేశ్యం లేదని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చెప్పారు. కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ఆలోచనే లేదన్నారాయన.
కాపులకు రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమం సాగిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం చేస్తోన్న ఆందోళనలు అధికార టిడిపికి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.

కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఆయన పార్టీ ఏర్పాటు విషయమై తన ఆలోచనను కుండబద్దలు కొట్టారు. కొత్త పార్టీ గాని, రాజకీయ పున: ప్రవేశం వంటి ఆలోచనలు గాని తనకు లేవని ఆయన చెప్పారు.
ప్రస్తుత రాజకీయాలు డబ్బు, మద్యంతో కూడుకొని ఉన్నాయని ఆయన చెప్పారు. తాను రాజకీయాల నుండి విరమించుకొన్నానని ఆనాడే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications