డైరెక్షన్ ప్రజలదే, చాలా సార్లు చెప్పా: చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కౌంటర్
విజయవాడ: తాను ఏ పార్టీ డైరెక్షన్‌లో పనిచేయడం లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజల డైరెక్షన్‌లోనే తాను పనిచేస్తున్నానని పవన్ చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వంలో చోటు చేసుకొన్న అవినీతిపై తాను చాలాసార్లు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళినట్టు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు
Recommended Video

విజయవాడలోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం నాడు వామపక్షపార్లీల నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన ఉద్యమాలపై చర్చించారు.
టిడిపి తనపై చేసిన ఆరోపణలకు జనసన చీఫ్ పవన్ కళ్యాణ్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. తాను చేసిన సూచనలను పట్టించుకోలేదన్నారు. తాను సూచనలు చేస్తే విమర్శలు చేస్తారా అని పవన్ కళ్యాన్ ప్రశ్నించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.

అవినీతిపై బాబుకు చాలాసార్లు చెప్పాను
ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో చోటు చేసుకొన్న రాష్ట్రంలో అవినీతిపై సీఎం చంద్రబాబునాయుడుకు తాను చాలాసార్లు చెప్పానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. అయినా ప్రభుత్వం తీరులో ఎలాంటి మార్పు రాలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ విషయాన్ని తాను బహిరంగ సభలో చెప్పానని ఆయన ప్రకటించారు. 2014 ఎన్నికల సమయంలో టిడిపి, బిజెపి కూటమికి తాను మద్దతిచ్చినట్టు చెప్పారు. అవినీతి విషయమై తనను ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ తరుణంలో బాబు వైఖరిలో మార్పు లేనందునే తాను ప్రశ్నించినట్టు చెప్పారు.

ప్రజల డైరెక్షన్‌లోనే పనిచేస్తా
తాను ప్రజల డైరెక్షన్‌లోనే పనిచేస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను బిజెపి డైరెక్షన్‌లో పనిచేస్తున్నానని టిడిపి చేసిన విమర్శలకు పవన్ కళ్యాణ్ ఘాటుగా సమాధానమిచ్చారు. తాను ఏ పార్టీ డైరెక్షన్‌లో పనిచేయబోనని ఆయన చెప్పారు . ప్రజలు ఏం కోరుకొంటారో, ప్రజలకు ఏం అవసరమో, ప్రజల డైరెక్షన్‌లోనే తాను పనిచేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

నాన్న కమ్యూనిష్టు సానుభూతిపరుడు
నాన్న కమ్యూనిష్టు పార్టీ సానుభూతిపరుడని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకొన్నారు. కమ్యూనిష్టులంటే తనకు గౌరవమని ఆయన చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం కమ్యూనిష్టు పార్టీలు పోరాటాలు చేస్తాయని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తన తండ్రి కూడ కమ్యూనిష్టు పార్టీ సానుభూతిపరుడని ఆయన చెప్పారు.

రాష్ట్రం కోసం ప్రాణాలిస్తా
రాష్ట్రం కోసం తాను ప్రాణాలను ఇచ్చేందుకు కూడ సిద్దంగా ఉన్నానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ల్ సాధన కోసం తాను ఎలాంటి త్యాగానికైనా సిద్దమేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రం కోసం కేంద్రంపై పోరాటంలో తన ప్రాణాలు ఇచ్చేందుకు కూడ సిద్దమేనని పవన్ కళ్యాణ్ చెప్పారు.

భయపడేది లేదు
తమ లక్ష్య సాధన కోసం భయపడేది లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. వామపక్షాలు కూడ ఎవరి బెదిరింపులకు కూడ భయపడవని ఆయన చెప్పారు. రాష్ట్రానికి దక్కాల్సిన హక్కుల కోసం పోరాటాలు కొనసాగించనున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.హైద్రాబాద్‌లో మైనార్టీల సంక్షేమం కోసం సిపిఎం నేత మధు చేసిన పోరాటాలు తనకు స్పూర్తిగా నిలిచాయని ఆయన గుర్తు చేశారు. మరో వైపు రాష్ట్ర విభజన సమయంలో తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించింది వామపక్షాలు మాత్రమేనని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications