ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ఐఏఎస్ వివేక్ యాదవ్ నియామకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్ నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివేక్ యాదవ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ప్రస్తుత ఏపీ సీఈవో బాధ్యతల నుంచి ముకేష్ కుమార్ రిలీవ్ కానున్నారు.

కాగా, ఎంకే మీనాకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముకేష్ కుమార్ మీనా నేతృత్వంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

IAS officer Vivek Yadav appointed as Andhra Pradesh chief election officer

మరోవైపు, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక అధికారులతోపాటు భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గురువారంనాడు కూడా పలువురు అధికారులను ఏపీ సర్కారు బదిలీ చేసింది. ఏపీలో గురువారం 19 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అనంతరామును అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆర్‌.పి. సిసోడియాకు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది.

జి.జయలక్ష్మి కి సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. కాంతిలాల్‌ దండే ఆర్‌ అండ్‌ బీ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేసింది. సురేశ్‌ కుమార్‌‌ను పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శి , గ్రామవార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. జీఏడీ కార్యదర్శిగానూ సురేశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సౌరభ్‌ గౌర్‌ ఐటీశాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. యువరాజ్‌ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ కార్యదర్శి గా హర్షవర్ధన్‌ మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. పి.భాస్కర్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యదర్శి, ఈడబ్ల్యూఎస్‌, జీఏడీ సర్వీసెస్‌ అదనపు బాధ్యతలు అప్పగించింది.

విజయరామరాజు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చింది. హిమాంశు శుక్లా సమాచార, పౌర సంబంధాలశాఖ డైరెక్టర్‌ గా నియమించింది. ఢిల్లీరావు వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చింది. వ్యవసాయశాఖ నుంచి హరికిరణ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. హరీశ్‌కుమార్‌ గుప్తా విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌ డీజీగా బదిలీ చేసింది. కుమార్‌ విశ్వజిత్‌ హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది. గిరిజాశంకర్‌ ను ఆర్థికశాఖ నుంచి రిలీవ్ చేసింది.

కె.కన్నబాబు సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌గానూ బాధ్యతలు అప్పగించింది. వినయ్‌చంద్‌ పర్యాటకశాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. వివేక్ యాదవ్‌ యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శి గా నియమించింది. సూర్యకుమారి మహిళా, శిశుసంక్షేమం, దివ్వాంగుల సంక్షేమ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సి.శ్రీధర్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. జె.నివాస్‌ ఆర్థికశాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+