ఎన్నికల వేళ.. ఏపీలో ఈ జిల్లాలకు కొత్త కలెక్టర్లు

Andhra Pradesh assembly election 2024: ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. షెడ్యూల్ విడుదల కావడానికి ఎంతో సమయం లేదు. దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకూ మార్చి మూడో వారంలో షెడ్యూల్ విడుదల కావడం దాదాపుగా ఖాయమైంది.

గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో అటు ప్రచార వేడీ పెరిగింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం, దాని మిత్రపక్షం జనసేన.. ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఆరు విడతల్లో పలు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులనూ ఖరారు చేసింది. టీడీపీ-జనసేన ఇంకా అభ్యర్థుల ఖరారుపై మల్లగుల్లాలు పడుతున్నాయి.

IAS officers were transferred in AP

ఈ పరిస్థితుల్లో ఏపీలో పలువురు ఐఎఎస్ అధికారుల బదిలీలు చోటు చేసుకున్నాయి. రెండు జిల్లాలకు కొత్త కలెక్టర్లు అపాయింట్ అయ్యారు. మరికొందరికి కీలక పోస్టింగులు లభించాయి. ఎన్నికలు సమీపించినప్పుడు ఐఎఎస్, ఐపీఎస్ స్థాయి అధికారుల బదిలీలు చోటు చేసుకోవడం సాధారణంగా జరిగే ప్రక్రియే. ఈ క్రమంలో మున్ముందు భారీగా బదిలీలు ఉండొచ్చు.

తాజాగా అయిదుమంది ఐఎఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి జిల్లాలకు కొత్త కలెక్టర్లు బదిలీ అయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమించారు.

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి.. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. అక్కడున్న రాహుల్ పాండేకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.

పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ ఎం విజయ సునీత బదిలీ అయ్యారు. ఆమెను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా నియమించారు. ఆమె స్థానంలో పౌర సరఫరాల సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీ వీరపాండ్యన్‌ను అదే సంస్థ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+