బీజేపీ కోర్ టీంలోకి జగన్ కీలక అధికారి..!!
సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. జగన్ హాయంలో ప్రవీణ్ ప్రకాశ్ కీలకంగా వ్యవహరించారు. సీఎంఓ తో సహా కీలక శాఖల్లోని అధికారులు ప్రవీణ్ ప్రకాశ్ వైఖరి పైన జగన్ కు ఫిర్యాదులు చేసారు. పలు వివాదాస్పద నిర్ణయాల అమలుకు ప్రయత్నించి విమర్శలకు కారణమయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత క్షమాపణ కోరారు. తాజాగా వీఆర్ఎస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాశ్ ఇప్పుడు బీజేపీలో మరో పాత్రకు సిద్దమయ్యారు.
రాజకీయాల్లోకి ఐఏఎస్
ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహార శైలి పైన అధికార వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన సమయంలో ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యకం చేసాయి. ఇక, ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసారు. ప్రభుత్వం వెంటనే నోటిఫై చేసింది. ప్రవీణ్ ప్రకాశ్ సతీమణి భావన సక్సేనా ఐపీఎస్ అధికారి. ఏడాదిన్నర క్రితమే ప్రవీణ్ ప్రకాశ్ వీఆర్ఎస్ తీసుకోవాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆయన ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గారు.

బీజేపీలో ఎంట్రీకి ప్లాన్
ప్రవీణ్ ప్రకాశ్ స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.. కొన్ని రోజులుగా ప్రవీణ్ ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. అక్కడే ఉండి తనకు తెలిసిన పెద్దల ద్వారా జోరుగా లాబీయింగ్ చేయిస్తున్నారు. మోదీ మానసపుత్రిక పథకమైన స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా గతంలో వారణాసిలో పనిచేసిన అనుభవం ప్రవీణ్ ప్రకాశ్‌కు ఉంది. పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే ఏపీ సీఎం జగన్‌కు ప్రవీణ్ చెప్పారని సమాచారం. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం ప్రవీణ్ ప్రకాశ్ కు బ్యాచ్ మెట్.
పక్కా ప్రణాళికా బద్దంగా
వీఆర్ఎస్ ఆమోదం పొందటంతో ఇక బీజేపీలో అధికారికంగా ఎంట్రీ ఇచ్చి..యూపీలో పార్టీ కోసం పని చేసేలా ప్రవీణ్ ప్రకాశ్ సిద్దం అవుతున్నారు. ఈ మేరకు అంతా సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే బీజేపీలో చేరేలా ప్రవీణ్ అంతా సెట్ చేసుకున్నారు. అయితే..రాజకీయంగా యూపీలో చోటు చేసుకున్న పరిణామాలతో వెనకడుగు వేసారు. ఇప్పుడు బీజేపీలోనే చేరితే ప్రవీణ్ ప్రకాశ్ సేవలను వినియోగించుకుంటామని కేంద్రంలో సీనియర్ మంత్రి నుంచి వచ్చిన ఆఫర్ తో ప్రవీణ్ ప్రకాశ్ తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications