ప్రొఫెసర్ సూసైడ్: భార్య నుండి తీసుకెళ్లిన పిల్లలు మిస్

 ICFAI Hyderabad professor ends life, search on for missing children
హైదరాబాద్: రైలు కిందపడి ప్రొఫెసర్ గురుప్రసాద్ (40) ఆత్యహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన తీసుకువెళ్లిన పిల్లల గురించి వెతుకుతున్నారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై గురు ప్రసాద్ మృతదేహం లభించింది.

భార్య సుహాసినికి కొంతకాలం కిందట విడాకులు ఇచ్చి ఆయన ఒంటరిగా ఉంటున్నారు. వారికి విఠల్ (9), నంద విహారి (5) అనే ఇద్దరు పిల్లలు. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న నేపథ్యంలో నెలలో ఒకటిన్నర రోజులు తండ్రి వద్ద ఉండాలని కోర్టు షరతు విధించింది.

ఈ మేరకు శనివారం ఉదయం భార్య నివాసం ఉండే ఆనంద్‌బాగ్ నుంచి పిల్లలిద్దరినీ తనతో తీసుకెళ్లిన గురు ప్రసాద్ రైలు పట్టాలపై శవమై కనిపించాడు. పిల్లల ఆచూకీ లభించకపోవటంతో భార్య తరపు వారిలో ఆందోళన నెలకొంది. మల్కాజిగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అల్వాల్ నివాసి అయిన రాఘవేంద్ర గురు ప్రసాద్, ఆనంద్‌బాగ్, మల్కాజిగిరి నివాసి సుహాసిని(38)తో దాదాపు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. విఠల్ (9), నందవిహరి (5). భార్యాభర్తల మధ్య వరకట్న సమస్య తలెత్తటంతో భార్య భర్తపై కేసు పెట్టినట్లుగా తెలుస్తోంది.

కోర్టులో వీరికి 2013లో విడాకులు మంజూరు అయ్యాయి. మొదటి శనివారం, మొదటి ఆదివారం, మూడో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భర్త వద్ద పిల్లలు ఉండాలని కోర్టు సూచించింది. దీని ప్రకారంగానే ఈ నెల నాలుగున శనివారం ఉదయం పిల్లలను ఆనంద్‌బాగ్ నుంచి తీసుకెళ్లిన గురు ప్రసాద్ మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంటకు తీసుకురాలేదు.

దీంతో సాయంత్రం వరకు ఎదురు చూసిన సుహాసినిలో ఆందోళన మొదలయింది. ఆ తర్వాత రాఘవేంద్ర గురు ప్రసాద్ సికింద్రాబాద్‌లోని జేమ్స్ స్ట్రీట్ వద్ద పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం రావటంతో సుహాసిని బంధువులు పిల్లల ఆచూకీ కోసం మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+