ఏపీకి మూడైతే యూపీకి 12 కావాలి ..తుగ్లక్ ముత్తాత నిర్ణయంలా జగన్ నిర్ణయమన్న కేశినేని నానీ

ఏపీ శాసనసభ సమావేశాల చివరి రోజు రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీ లో జరిగిన సుదీర్ఘ చర్చ జరిగింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు ఉంటె బాగుంటుంది అని చేసిన ప్రకటనపై ఇప్పటికే రాజధాని రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇక మరోపక్క ఏపీలోని ప్రతిపక్ష టీడీపీ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏపీకి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు అనాలోచిత వ్యాఖ్యలని టీడీపీ మండిపడుతోంది.

టీడీపీ సీనియర్ నేత, ఎంపీ కేశినేని నానీ జగన్ చేసిన ప్రకటనపై స్పందించారు. జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని పేర్కొన్నారు. తుగ్లక్ పాలనను మించి తుగ్లక్ ముత్తాత పాలనలా జగన్ పాలన ఉందని ఆయన పేర్కొన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రానికి నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని ఆయన విమర్శించారు.

If AP needs 3 then UP wants 12 .. tuglak great-grandfathers decision: Keshineni Nani fire

ప్రతి గ్రామాన్ని రాజధాని తరహాలో అభివృద్ధి చెయ్యాలి కానీ రాజధానిని మార్చటం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు . ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలనాపరమైన సమస్యలు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు.

151మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఇష్టారాజ్యంగా జగన్ ప్రవర్తిస్తున్నారని కేశినేని నానీ మండిపడ్డారు. ఐదు కోట్ల జనాభా ఉన్న ఏపీకి మూడు రాజధానులు అవసరం అయితే 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కు 12 రాజధానులు కావాలని ఆయన ఎద్దేవా చేశారు. ఏది పడితే అది ప్రకటనలు చేస్తూ జగన్ జగన్ రాష్ట్రాన్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ కేశినేని నానీ .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+