నంద్యాల: మౌనిక దూకుడు, అదే జరిగితే వైసీపీకి తీవ్ర నష్టమేనా?
Recommended Video

నంద్యాల:నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఏపీ మంత్రి పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక వ్యవహరించిన తీరు పట్ల టిడిపి నాయకత్వం సంతోషంతో ఉంది. బ్రహ్మనందరెడ్డి కాకుండా మౌనిక నంద్యాలలో బరిలో నిలిస్తే మెజారిటీ మరింత పెరిగే అవకాశం ఉండేదని ఆ పార్టీ నాయకులు కొందరు అభిప్రాయంతో ఉన్నారు.
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో భూమా మౌనిక దూకుడు పార్టీకి కలిసివచ్చిందని ఆ పార్టీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు.నంద్యాల ఉప ఎన్నికల్లో మౌనిక పేరు తొలుత విన్పించింది. కానీ, బ్రహ్మనందరెడ్డిని బరిలోకి దింపారు.
మౌనిక రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిని చూపారనే వార్తలు కూడ వచ్చాయి. కానీ, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో మౌనిక కుటుంబ వ్యవహరాలను చూసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో బ్రహ్మనందరెడ్డిని బరిలోకి దింపాల్సి వచ్చింది.
నంద్యాల ఉప ఎన్నిక సమయంలో నిర్వహించిన ఎన్నికల సభల్లోనూ భూమా మౌనిక ప్రసంగించిన తీరు ప్రజలను ఆకట్టుకొనే విధంగా ఉందని టిడిపి సీనియర్లు గుర్తించారు.

మౌనిక దూకుడు కలిసివచ్చింది
నంద్యాల ఉపఎన్నికల సమయంలో భూమా మౌనిక వ్యవహరించిన తీరు పార్టీకి కలిసివచ్చిందనే అభిప్రాయంతో పార్టీ సీనియర్లున్నారు. ఎన్నికల సమయంలో ఆమె ప్రజలను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించారని కొందరు పార్టీ సీనియర్లు బాబు దృష్టికి తీసుకెళ్ళారు. ప్రసంగాలతో ప్రజలను తన వైపుకు తిప్పుకొనే సామర్థ్యం కూడ ఉందని టిడిపి నేతలు కొందరు అభిప్రాయంతో ఉన్నారు.

మద్దతు దారులను కూడగట్టిన మౌనిక
నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా కుటుంబానికి మద్దతుగా నిలిచేవారిని మౌనిక కూడగట్టారు. భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత భూమా కుటుంబానికి అండగా నిలిచేవారిని మౌనిక వ్యక్తిగతంగా కిలిసి ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. ప్రజలతో చొరవగా కలిసే మనస్తతత్వం మౌనికకు ఉంది. ప్రజలు చెప్పే సమస్యలన ఓపికగా వినడం, వారికి సమాధానాలు చెప్పడం కూడ కొందరు టిడిపి నేతల దృష్టిలో పడింది.

మౌనికను రంగంలోకి దించితే పరిస్థితి మరోలా ఉండేది
నంద్యాలలో భూమా మౌనికను రంగంలకి దించితే పరిస్థితి మరోలా ఉండేదని కొందరు టిడిపి సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో బ్రహ్మనందరెడ్డి దూకుడుగా వ్యవహరించినా... మౌనికతో పోలిస్తే కొంత వెనుకబడ్డారనే అభిప్రాయాలను కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్రహ్మనందరెడ్డి కాకుండా మౌనికను ఎన్నికల బరిలో నిలిపితే మెజారిటీ మరింత పెరిగే అవకాశం ఉండేదని పార్టీ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు.

పోలింగ్ రోజున ఫ్యాక్షన్ గ్రామాల్లో మౌనిక టూర్
పోలింగ్ రోజున ఫ్యాక్షన్ గ్రామాల్లో భూమా మౌనిక పర్యటించడం టిడిపి అభ్యర్థికి ఓట్లు వేయాలని కోరడం సంచలనం కల్గించింది. కొన్ని పోలింగ్ బూత్‌ల్లో ఆమె వ్యవహరించిన తీరు పట్ల వైసీపీ ఎన్నికల సంఘానికి కూడ ఫిర్యాదు చేసింది.ఆయా గ్రామాల్లో పర్యటించి పోలింగ్ సరళిని ఆమె తెలుసుకొన్నారు.నంద్యాల ఎన్నికల్లో ఇంచార్జీలుగా వ్యవహరించిన పార్టీ నేతలు మౌనిక పార్టీలో చురుకుగా పాల్గొంటే పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications