బాబు సీఎం కాకుంటే నన్ను చంపేసేవారు: పవన్ సంచలనం, ఆ డబ్బు తింటే?, వైఎస్ మరణంపై..

Subscribe to Oneindia Telugu
  Pawan Kalyan Tour : డబ్బుతింటే ఎలా బతుకుతారు? YSR చనిపోతారని ఊహించారా? | Oneindia Telugu

  రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస పర్యటనలతో దూసుకుపోతున్నారు. అటు అధికార పక్షంపై ఇటు ప్రతిపక్షంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయకత్వంపై ఇప్పటికీ తనకు నమ్మకముందని గతంలో మాదిరే విధేయతను ప్రదర్శిస్తున్నారు.

  అలాగే రాజకీయాలకు తాను ఏవిధంగా సమర్థుడినో పరోక్షంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్తలతో సమావేశంలో భాగంగా సుమారు సుమారు గంటా 15 నిమిషాల పాటు పవర్ కళ్యాణ్ ప్రసంగించారు.

  ఈ సందర్భంగా జగన్, లోకేష్ ల నేపథ్యంపై.. కాపు రిజర్వేషన్లపై.. ఇలా పలు ఆసక్తికర అంశాలపై ఆయన తనదైన రీతిలో స్పందించారు.

  ఇట్స్ క్లియర్?: పవన్ శత్రువు ఎవరో తేలిపోయింది.., వైసీపీని చావుదెబ్బ కొట్టడానికే కంకణం?

  ఈపాటికి చంపేసేవారు:

  ఈపాటికి చంపేసేవారు:

  టీడీపీకి, బీజేపీకి మద్దతు తెలపడమనేది ఆవేశంతో చేసిన పని కాదని, ఆలోచనతో చేశానని పవన్ వివరించారు. అనుకుంటే.. ఆ సమయంలో తాను కూడా పోటీ చేసి ఉండేవాడినని కానీ ఓట్లు చీల్చడం తనకు ఇష్టం లేదని అన్నారు. ఆ సమయంలో టీడీపీ-బీజేపీలకు మద్దతు తెలిపినందుకు చాలామంది తనను ప్రశ్నించారని, ఈ విషయంలో చాలామందితో గొడవ కూడా పడ్డానని తెలిపారు.

  చిరంజీవిలా మంచోడ్నికాదు, అల్లు అరవింద్ నన్ను అలా చూశారు, ఏంచేయలేకపోయా: పవన్ సంచలనం

  ఇప్పటికీ నమ్ముతున్నా!:

  ఇప్పటికీ నమ్ముతున్నా!:


  'ఒకవేళ అప్పుడు మోడీ ప్రధాని కాకపోయినా.. చంద్రబాబు సీఎం కాకపోయినా ఈపాటికి నన్ను చంపేసేవారు' అని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

  గతంలో మాదిరే ఇప్పుడు కూడా చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ అదే విధేయతను చాటుకుంటున్నారు. ఆయన నాయకత్వంపై ఇప్పటికీ తనకు నమ్మకం ఉందని తాజా ప్రసంగంలోను చెప్పారు.

  తెలంగాణ అలా రాలేదు: రిజర్వేషన్లపై పవన్, ఆర్ కృష్ణయ్యపై, రామ్మోహన్ నాయుడు కౌంటర్

  వైఎస్ మరణంపై:

  వైఎస్ మరణంపై:

  పరోక్షంగా మరోసారి వైసీపీపై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతితో ముడిపెడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ లపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ఉపయోగపడాల్సిన డబ్బుతింటే మీరెలా బతుకుతారు? అని ప్రశ్నించిన ఆయన.. ప్రకృతి దారుణమైందని, రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోతారని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. అలాగే ఆయన తనయుడు జగన్ ఏడాదికిపైగా జైల్లో ఉంటారని ఎవరైనా అనుకున్నారా? అని గుర్తుచేశారు.

  మూర్ఖంగాను ప్రవర్తించగలను:

  మూర్ఖంగాను ప్రవర్తించగలను:


  డబ్బు ఉంటేనే రాజకీయాలంటే కుదరదని, అది లేకుండా నేను చేసి చూపిస్తానని అన్నారు. అవసరమైతే చొక్కా మడత పెట్టి కూడా పోరాటం చేయగలనని చెప్పారు. ఓ చెంపమీద కొడితే తాను రెండో చెంప చూపే రకం కాదని.. మూర్ఖంగాను ప్రవర్తించగలనని స్పష్టం చేశారు.

  ఓ ఉద్యోగి రూ.5 వేలు లంచం తీసుకుంటే బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారని రాజకీయ నేతలను మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని అన్నారు. మనస్సాక్షి ఉంటే అవినీతి డబ్బు తినలేరని అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Janasena President Pawan Kalyan made sensational comments on CM Chandrababu Naidu. He said if Babu have not become CM he definitely killed already.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X