అదే జరిగితే జనసేన కథ ముగిసినట్లే: పవన్‌కు హెచ్చరిక, తెరవెనుక ఏం జరుగుతోంది?
Recommended Video

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఓ వైపు అన్ని పార్టీలు తాము ఒంటరిగా ముందుకు సాగుతామని చెబుతున్నాయి. మరోవైపు, పొత్తుల కోసం ఎదురు చూస్తున్న వైఖరి కూడా కొన్ని పార్టీల్లో కనిపిస్తోంది. అందుకు నేతల వ్యాఖ్యలే నిదర్శనం. వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి.
జనసేన అధినేత జగన్‌కు మద్దతిచ్చేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారని, చంద్రబాబు అవినీతి జనసేనానికి నచ్చలేదని ఆయన అన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పవన్, జగన్‌లు వచ్చే ఎన్నికల్లో కలుస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. దీనిపై పరోక్షంగా పవన్ కొట్టిపారేశారు. అయినప్పటికీ ఆ చర్చ మాత్రం కొనసాగుతోంది.

జగన్, పవన్‌లపై కీలక వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో సీపీఐ నేత రామకృష్ణ సోమవారం ఆసక్తికర, కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, జగన్ కలిస్తే ఏమవుతుందో కూడా చెప్పారు. అదే జరిగితే కనుక పవన్ కళ్యాణ్ పార్టీ పని అయిపోయినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. తద్వారా ఇరు పార్టీల పొత్తు సరికాదని అభిప్రాయపడ్డారు.

అదే జరిగితే జనసేన కథ ముగిసినట్లే.. పవన్‌కు హెచ్చరిక
జగన్ ధ్యాస అంతా ముఖ్యమంత్రి పదవి సీటుపైనే ఉందని రామకృష్ణ మండిపడ్డారు. ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని వెల్లడించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని దోచేశారని నిప్పులు చెరిగారు. జగన్‌ను అంత సులభంగా ప్రజలు నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదని ఆయన తేల్చి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పవన్ జతకడితే జనసేన కథ ముగిసినట్లేనని ఆయన హెచ్చరించారు.

తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా?
ఇదిలా ఉండగా, జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిర్చేందుకు తెరవెనుక ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చ కూడా సాగుతోంది. చంద్రబాబుకు దూరమైన పవన్.. జగన్ పట్ల సానుకూలంగా ఉన్నారా, వచ్చే ఎన్నికల్లో మద్దతు ప్రకటిస్తారా అనే చర్చ సాగుతోంది. లేదా వీరి మధ్య పొత్తుకు మరెవరైనా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది.

పవన్ కళ్యాణ్‌కే నష్టం, ఒంటరిగా వెళ్తే చక్రం తిప్పొచ్చు
పవన్ పొత్తుకు సుముఖంగా లేనప్పటికీ లేదా జనసేనాని తమకు మద్దతిచ్చినా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నప్పటికీ.. పొత్తుపై ప్రశ్నలు ఉదయిస్తున్న నేపథ్యంలో.. ఇద్దరు కలిస్తే ఏం జరుగుతుందనే చర్చ సాగుతోంది. జగన్, పవన్ కలిస్తే జనసేనానికే నష్టమని, జగన్ లాభపడతారని, అదే ఒంటరిగా పోటీ చేస్తే.. కర్ణాటక ఎన్నికల్లో వలే కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఏ పార్టీకి అవకాశం కనిపించడం లేదని, హంగ్ వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయని, అప్పుడు పవన్ చక్రం తిప్పేస్థాయిలో ఉంటారని, సీఎం ఎవరైనా అప్పుడు ఆయన ప్రభుత్వంతో పని చేయించగలుగుతారని అంటున్నారు.












Click it and Unblock the Notifications