కోర్టులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు: రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్
సనాతన ధర్మంపై దాడి జరిగితే ఊరుకోవాలా? అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏడు కొండలవాడికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామన్నారు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే తిరుపతికి వచ్చానని అన్నారు. ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమేనని స్పష్టం చేశారు. గురువారం తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో ఆయన మాట్లాడారు.
ఏడు కొండవాడికి అపచారం జరిగితే ఎలా ఊరుకుంటాం. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా? ఓట్ల కోసమే మాట్లాడతామా? నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు. నాకు అన్యాయం జరిగితే బయటకు రాలేదు. తిరుమలలో అపచారం జరుగుతోంది.. సరిదిద్దండి అని గతంలో చెప్పా. పట్టించుకోలేదు. అందుకే 11 సీట్లకే పరిమితమయ్యారు అంటూ వైసీపీపై మండిపడ్డారు పవన్ కళ్యాణ్.

ధర్మాన్ని మనం రక్షిస్తే.. ధర్మం మనల్ని రక్షిస్తుంది. కలియుగ ధర్మానికి ప్రతిరూపం వేంకటేశ్వరస్వామి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దాన్ని తక్షణమే తీసుకురావాలి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో 'సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు' ఏర్పాటు కావాలి. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి. సనాతన ధర్మాన్ని కించపరచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
BIG statement by Andhra Pradesh Dy CM Pawan Kalyan. He has criticized the Indian court system, claiming it is harsh towards those who follow 'Sanatana Dharma' while being lenient towards individuals from other religions. pic.twitter.com/dzU7nq1wC0
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 3, 2024
ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీపై పవన్ ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి హిందూ ఓట్లు కావాలి కానీ.. హిందూ దేవుళ్లను మాత్రం గౌరవించరని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. శ్రీరాముడిని రాహుల్ గాంధీ చాలా సార్లు అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై శ్రీరాముడిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
Pawan Kalyan rips apart Rahul Gandhi over his comments on Bhagwan Ram .. you need Hindu votes to come to power but you don’t respect Bhagwan Ram .. don’t dare to disrespect him 🔥 pic.twitter.com/YPMUVgZXtv
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) October 3, 2024
కోర్టులపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
సనాతన ధర్మాన్ని దూషించే వారికే అనుకూలంగా కోర్టులు వ్యవహరిస్తున్నాయని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మం పాటించే వారిపై నిర్దాక్షిణ్యంగా, అన్య ధర్మాలను పాటించే వారిపై మానవత్వం చూపిస్తాయి. అయినవాళ్లకి ఆకులు.. కానివాళ్లకు కంచాలు అన్న దుస్థితి దాపురించింది. ఇప్పుడు ఆకులు కూడా లేవు, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు ' అని తీవ్రస్థాయిలో స్పందించారు పవన్ కళ్యాణ్.
BIG statement by Andhra Pradesh Dy CM Pawan Kalyan. He has criticized the Indian court system, claiming it is harsh towards those who follow 'Sanatana Dharma' while being lenient towards individuals from other religions. pic.twitter.com/dzU7nq1wC0
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 3, 2024
ఉదయనిధి స్టాలిన్ అంటూ పవన్ కళ్యాణ్..
మన సనాతన ధర్మాన్ని మనం ఆరాధించుకుందాం. ఇస్లాం, క్రైస్తవ, సిక్కు, అన్యమతాలని గౌరవిద్దాం. మన సనాతన ధర్మం మీద ఎవరైనా దాడి చేసినా, అపహాస్యం చేసినా, దూషించినా... ప్రాణాలోడ్డయిన సరే మన ధర్మాన్ని శాయశక్తులా రక్షించుకుందాం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
దేవుని ఆశీసులు తీసుకుని చెప్తున్నాను, సనాతన ధర్మాన్ని మీరు ఎవరు ఏమి చేయలేరు గుర్తుంచుకోండి ఉదయనిధి స్టాలిన్.. మీలాంటి వారు వస్తారు, పోతారు, కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. భారత సనాతన ధర్మాన్ని అంతం చేయాలి అనుకోవడం ఒక కొండని ఉలి దెబ్బతో కూల్చేయాలి అనుకోవడమే అని పవన్ కళ్యాణ్ అన్నారు.
సనాతన ధర్మం నాశనం చేస్తానని చెప్తున్నారు ఉదయనిధి స్టాలిన్, ఇంతకు ముందు చాలా మంది చెప్పారు, చాలామంది వస్తారు, పోతారు కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. జగన్ ఈరోజు అమాయకుడిలా నటిస్తున్నాడు, గత 5 సంవత్సరాల్లో అతను చేసిన పనులు, గతంలో అతనిపై ఉన్న అవినీతి కేసులు గుర్తు చేసుకోవాలని జాతీయ మీడియాకు కూడా అభ్యర్ధిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.












Click it and Unblock the Notifications