క్వాటర్ కొంటే.. గుడ్డు+గ్లాస్+వాటర్ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తారు! దీపావళి బంపర్ ఆఫర్!!
ఏ వ్యాపారానికి అయినా కస్టమర్లే దేవుళ్లు. అదే మద్యం వ్యాపారానికి అయితే మందుబాబులు దేవుళ్లకు మించి అనే చెప్పాలి. అలాంటి దేవుళ్లను ఆకర్షించి.. తమ గళ్లా పెట్టెలను నింపుకొనేందుకు వ్యాపారులు చేసే జిమ్మిక్కులు అన్నీఇన్నీ కావు. దీపావళి పండగ నేపథ్యంలో మందుబాబులను తమవైపు తిప్పుకునేందుకు స్వాగతం.. సుస్వాగం.. అంటూ మద్యం షాపుల వద్ద పెద్ద పెద్ద బ్యానర్‌లు వెలిశాయి. దీపావళి ధమాకా పేరుతో ప్రత్యేక ఆఫర్‌లు కూడా ప్రకటించేస్తున్నారు.
వినూత్న ఆలోచనలు..
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువైన తర్వాత అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం కొత్త లిక్కర్ పాలసీ అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ప్రభుత్వ వైన్ షాపులకు స్వస్తిపలికి, ఈ కొత్త లిక్కర్ పాలసీని తెరమీదకు తీసుకువచ్చింది. దీంతో మద్యం అమ్మకాలు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. తాజాగా వ్యాపారులు మద్యంప్రియులను ఆకర్షించేందుకు వినూత్న ఆలోచనలకు తెరలేపుతున్నారు.

మగవారికీ ఆఫర్‌లు ఉన్నాయి..
తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఓ వైన్ షాపు ముందు వెలసిన ఫ్లెక్సీ నెట్టింట వైరల్‌గా మారింది. మందు ప్రియులకు కిక్కు ఇచ్చేలా దివాళి బోనంజ ఆఫర్ ప్రకటించారు. షాపులో మద్యం బాటిల్ కొనుక్కోవడమే తరవాయి. మందుబాబుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ తామే సమకూర్చేలా.. ఒక బాటిల్ కొనుక్కుంటే ఒక గుడ్డు, ఓ గ్లాసు, వాటర్ ప్యాకెట్ ఫ్రీగా అందిస్తామంటూ పెద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇలాంటి ఆఫర్‌లతో దీపావళి పండగను మందుబాబులకు ముందే తెచ్చిన యజమానులకు ఇవే మా వందనాలు అంటూ కొందరు కామెట్ చేస్తుంటే.. పండగలకు ఆడవారికి మాత్రమే ఆఫర్‌లు అనుకునేవాళ్లం.. వాళ్లతోపాటు మాకూ ఆఫర్స్ వర్తిస్తాయని ఇప్పుడే తెలిసింది అంటూ మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.












Click it and Unblock the Notifications