వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా చేస్తే ప్రతిపక్షంలో కూర్చుంటారు : జగన్ కు నారాయణ హితవు

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ కు సిపిఐ నేత నారాయణ సున్నితంగా చురకలు అంటించారు . గతంలో టీడీపీ ప్రభుత్వం చేసింది కక్ష సాధింపు అన్నారని, నేడు జగన్‌ చేస్తున్నది అదే పాలన అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ సర్కార్ పాలనపై విమర్శలు గుప్పించారు . జగన్‌ పాలన బాగుంటుందని తాను అనుకొన్నానని పేర్కొన్న నారాయణ .చంద్రబాబుపై ఉన్న కక్షతో జగన్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు.

జగన్‌ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. క్యాపిటల్ గా అమరావతికే సీపీఐ కట్టుబడి ఉందన్నారు నారాయణ. జీఎన్‌రావు కమిటీకి విలువ లేదని నారయణ అభిప్రాయపడ్డారు. ఇక జగన్‌ అనాలోచిత నిర్ణయాలు ఆయనకు భవిష్యత్ లో ఇబ్బంది కలిగిస్తాయని అన్నారు.ఫ్లెమింగో ఫెస్టివల్‌ పేరుతో పార్టీ ప్రచారం వద్దని నారాయణ అన్నారు. ఇక అధికారులపై కక్ష సాధింపు చర్యలను ప్రస్తావిస్తూ ఐఆర్‌ఎస్‌ అధికారి కృష్ణ ప్రసాద్‌పై కక్ష సరికాదని పేర్కొన్నారు.

If you do that you will sit in the opposition: Narayana to Jagan

ఏ ప్రభుత్వం ఉంటే వారి ఆలోచనలతోనే అధికారులు పనిచేస్తారని ఆయన చెప్పారు. అంత మాత్రాన వారిపై వేధింపులకు దిగటం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు టీడీపీని తొక్కేందుకు బీజేపీ ప్రభుత్వం జైలులో ఉన్న వ్యక్తికి సీఎస్‌ పదవిని కట్టబెట్టలేదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలాగా పాలన చేస్తామంటే భవిష్యత్‌లో ప్రతిపక్షంలో కూర్చోవాల్సివస్తుందని నారాయణ హెచ్చరించారు.ఇప్పటికైనా జగన్ తీసుకునే నిర్ణయాల విషయంలో అలోచించి తీసుకోవాలని నారాయణ హితవు పలికారు.

English summary
CPI leader Narayana expressed outrage over AP CM Jagan. Narayana said CPI was committed to Amaravati as capital. Narayana believes that the JN RAO committee has no value. Narayana said during the party's campaign titled "Flamingo Festival" that Jagan's unintended decisions will hurt him in the future. Referring to factional actions against the officials, the IRS official Krishna Prasad's was inappropriate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X