వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌రెడ్డి టమాట రైతుల గోడు పట్టదా, అసెంబ్లీలో ప్రకటించండి, లేదంటే ఆందోళన:పవన్ కల్యాణ్

|
Google Oneindia TeluguNews

టమాట రైతుల బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. గిట్టుబాటు ధర రాక రైతులు కూలీలుగా మారుతున్నారని గుర్తుచేశారు. భవన నిర్మాణ కార్మికులు గోడు పట్టించుకోరు, రైతు సమస్యలను ఆలకించరు.. సీఎం జగన్‌కు కావాల్సింది మత మార్పిడిలేనని విమర్శించారు. గురువారం మదనపల్లె మార్కెట్‌లో రైతుల గోడును పవన్ కల్యాణ్ ఆలకించారు.

 పసిపాపలా సాకితే..

పసిపాపలా సాకితే..

టమాట పంటను పసి పాపను సాకినట్టు చూసుకొని తీరా మార్కెట్‌కు తీసుకొస్తే దళారీల చేతిలో రైతులు మోసపోతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఓ రైతుగా అన్నదాతల బాధలను తెలుసుకొనేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు. మన రాష్ట్రంలో క్రెట్ 32 కిలోలు ఉంటే.. పొరుగున గల కర్ణాటకలో మాత్రం 15 కిలోలేనని స్పష్టంచేశారు. టమాటను బట్టి క్రెట్‌కు రూ.150 నుంచి 250 వరకే ఇస్తున్నారని.. దీంతో రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారని వివరించారు.

అమరావతిలో ఆందోళన

అమరావతిలో ఆందోళన

రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే అమరావతిలో ఆందోళన చేస్తానని హెచ్చరించారు. తన ఆరునెలల పాలనలో సీఎం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజావేదిక కూల్చేయడం, కాంట్రాక్టులు రద్దు చేయడంపైనే ఫోకస్ చేశారని పేర్కొన్నారు. రైతు సమస్యలను మాత్రం గాలికొదిలేశారని విమర్శించారు.

తిట్టడమే పని

తిట్టడమే పని

ఎంతకీ పవన్ కల్యాణ్, ఇతర నేతలపై విమర్శలు చేద్దామనే తప్ప.. మిగతా అంశాలపై సీఎం జగన్‌కు సోయి లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెడుతామని చెప్తున్నారు. ముందు రైతుల కడుపు నింపండి అని సూచించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్.. ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం పాటుపడాలని సూచించారు. లేదంటే కుర్చీలను చేజేతులా మీరు కూలదోసుకున్నవారవుతారని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

రూ.566 కోట్లు ఏవీ..

రూ.566 కోట్లు ఏవీ..

రైతులకు కేటాయిస్తానని ప్రభుత్వం ప్రకటించిన రూ.566 కోట్లు ఏమయ్యాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. అన్నదాతల కోసం కేటాయించిన నిధులు మూలిగిపోతున్నాయని మండిపడ్డారు. రైతులకు న్యాయం చేసేందుకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. తమ గోడును రైతులు వెల్లబోసుకున్నారు. పంట పండించి మార్కెట్‌కు తీసుకొచ్చిన సమయంలో నిలువుదోపిడీకి గురవుతున్నామని చెప్పారు.

టమాట, శనగ పంటలే

టమాట, శనగ పంటలే

చిత్తూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో టమాట, శనగ ప్రధాన పంటలని రైతులు చెప్తున్నారు. టమాట పంట 70 రోజులకు కాతకు వస్తోందని వివరించారు. ఎకరాకు 1.20 లక్షలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. క్రెట్ బాక్స్ రూ.450 అంతకన్నా ఎక్కువకు విక్రయిస్తే తమకు లాభం వస్తోందని చెప్పారు. రెండు, మూడురోజుల క్రితం వరకు వెయ్యి, ఆపై పలికిన టమాట ధర ఇప్పుడు తగ్గడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

400 క్రెట్లు.. కానీ

400 క్రెట్లు.. కానీ


ఎకరంలో టమాట 300 నుంచి 400 క్రెట్లు వస్తుందని రైతులు చెప్తున్నారు. టమాట తెంపడానికి కూలీలకు సగం దినానికే రూ.300 ఇవ్వాల్సి వస్తోందని చెప్తున్నారు. అలా రూ.4500 కూలీలకు ఇస్తూ.. మదనపల్లె మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు క్రెట్‌కు రవాణా ఖర్చు రూ.20 ఇస్తున్నామని చెప్పారు. ఇక్కడికొచ్చాక కమిషన్ 4 శాతం అని బోర్డు మీద ఉంటే 10 శాతం తీసుకుంటున్నారని వాపోయారు. తర్వాత గ్రేడ్లు చేసేందుకు బాక్స్ రూ.3 చొప్పున దోచుకుంటున్నారని విలపించారు.

రూ.250.. నష్టాల ఊబిలో...

రూ.250.. నష్టాల ఊబిలో...

ఇలా టమాట తీసుకొస్తే క్రెట్‌కు రూ.150 నుంచి రూ.250 వరకు ఇస్తామని చెప్తున్నారని రైతులు వాపోతున్నారు. క్రెట్‌కు రూ.450 ఇస్తేనే కూలీలు గిట్టుబాటు అవుతాయని చెప్పారు. లాభం రావాలంటే రూ.500 నుంచి రూ.600 వరకు ఇవ్వాలని కోరుతున్నారు. మార్కెట్ సిబ్బంది, దళారులు కుమ్మక్కవడంతో అన్యాయానికి గురవుతున్నామని చెప్పారు.

రైతు నుంచి కూలీగా

రైతు నుంచి కూలీగా

టమాట పంట వేసి నష్టపోయామని మరో రైతు బోరుమని విలపించాడు. రెండుసార్లు తనకు నష్టం రావడంతో పంట సాగుచేయడమే మానేసినట్టు తెలిపాడు. మదనపల్లె మార్కెట్‌లో కూలీ పనిచేస్తున్నానని వివరించారు. తమలాగా చాలామంది కూడా మార్కెట్‌లో పనిచేస్తున్నారని చెప్పారు. మరోవైపు హమాలీలు కూడా తమ బాధలను పవన్ కల్యాణ్‌కు వివరించారు. తమకు రోజుకు రూ.200 కూలీ ఇస్తున్నారని చెప్పారు.

English summary
if you not Justice to tomato farmer i will agitation at amaravati pawan kalyan said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X