వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన: ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాలో ఏ విద్యాసంస్థ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం ప్రకటించిన విద్యా సంస్థలను పదమూడు జిల్లాల్లో ఆయా ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మంజూరు చేసిన జాతీయస్థాయి విద్యాసంస్థలను అన్ని జిల్లాలకు కేటాయించనున్నారు.

తిరుపతిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యూకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) లాంటి జాతీయ విద్యా సంస్థలను నెలకొల్పనున్నారు.

IIT and IISER to Tirupati

కర్నూలులో ఐఐఐటి, అనంతపురంలో ఎన్ఐటీ, తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, విశాఖలో ఐఐఎం, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, తూర్పుగోదావరిలో పెట్రోలియం విశ్వవిద్యాలయం, పశ్చిమగోదావరిలో సెంట్రల్ లేదా అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం, కృష్ణా - గుంటూరులో ఏఐఎంఎస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లను ఏర్పాటు చేయనున్నారు.

కాగా, ఆదివారం విశాఖలో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో విమానాశ్రయం, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

English summary
IIT and IISER to Tirupati and IIIT to Kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X