మద్రాస్ ఐఐటి నుంచి ఆంధ్ర విద్యార్థిని మాయం: హిమాలయాలకు వెళ్తున్నానని లేఖ
చెన్నై: మద్రాసు ఐఐటీలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని హిమాలయాలకు వెళుతున్నట్లు లేఖ రాసి అదృశ్యమైంది. ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రకాశం జిల్లా రావినూతలకు చెందిన ప్రత్యూష (20) ఐఐటీ ప్రాంగణంలోని సబర్మతి హాస్టల్‌లో ఉంటోంది.
అయితే ఆమె ఆదివారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన విద్యార్థినులు వార్డెన్‌కు ఫిర్యాదు చేయగా వారు పోలీసులను ఆశ్రయించారు. ప్రాథమిక పరిశీలనలో ప్రత్యూష ఉంటున్న హాస్టల్ గదిలో తెలుగు, ఇంగ్లిషులో రాసిన లేఖ దొరికింది.

తనకు ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి అధికమైందని, భగవంతుడి అన్వేషణ కోసం హిమాలయాలకు వెళుతున్నానని, తన కోసం వెతకొద్దని లేఖలో రాసింది. కోట్టూరుపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థిని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
తనకు సాహసం చేయడం ఇష్టమని, ఆధ్యాత్మికంపై తాను పరిశోధన చేస్తానని కూడా ఆమె తన లేఖలో రాసింది. జీవితంలోని ఉన్నత స్థాయి వాస్తవాలను తెలుసుకోవాలని తాను అనుకుంటున్నట్లు కూడా రాసింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications