వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌ హామీ: తెలంగాణతో ఐకెఇఎ ఒప్పందం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్వీడిష్ ఫర్నీచర్ రిటైలర్ ఐకియా ఎబి అనుబంధ సంస్థ ఐకెఇఎతో తెలంగాణ ప్రభుత్వం బుధవారంనాడు అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం మేరకు సంస్థ తెలంగాణలో తన స్టోర్‌ను నెలకొల్పుతుంది. 1943లో ఏర్పాటైన ఐకెఇఎ ప్రపంచంలోని ఫర్నీచర్, గృహవస్తువులు, టెక్స్‌టైల్స్‌ల్లోని అతి పెద్ద కంపెనీల్లో ఒకటి.

రిటైల్ రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో దేశంలోకి వచ్చిన తొలి కంపెనీల్లో ఇది ఒక్కటి. 10,500 కోట్ల రూపాయలతో సింగిల్ బ్రాండ్ స్టోర్ల స్థాపనకు ఈ స్వీడిష్ కంపెనీ ప్రితపాదనను 2013 మేలో అంగీకరించారు.

హైదరాబాద్

భారతదేశంలో తన తొలి స్టోర్‌ను హైదరాబాదులో ఏర్పాటు చేయడం ద్వారా ఐకిఇఎ చిత్రపటంలో చోటు సంపాదించుకుంటుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దీనివల్ల అద్భుతమైన ఆర్థిక ప్రభావం రాష్ట్రంలో ఉంటుందని తెలిపింది.

ఐకెఇఎకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కె.చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. నిర్మల్, సిల్వర్ ఫిలిగ్రి, పెంబర్తి వంటి తెలంగాణ కళాకారులతో సంస్థ ఒప్పందాలు చేసుకుని పనిచేయాలని ఆయన సూచించారు. ఓ మెట్రో రైలు టెర్మినల్ వద్ద తమ స్టోర్ ఏర్పాటు చేసుకోవడానికి సహకరించాలని ఐకెఇఎ ఇండియా సిఇవో జవెంక్యో మాయెజ్టు చేసిన విజ్ఞప్తికి కెసిఆర్ సానుకూలంగా ప్రతిస్పందించారు.

English summary
IKEA India, a subsidiary of Swedish furniture retailer Ikea AB, on September 24 signed an MoU with the Telangana government for establishing its store in the state. Founded in 1943, IKEA is one of the world's largest retailers in furniture, household goods and textiles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X