హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హవాలా గ్యాంగ్ అరెస్ట్: రూ. 2 కోట్లు స్వాధీనం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు హవాలా గ్యాంగ్ గుట్టును రట్టు చేశారు. ఒక కోటీ 90లక్షలా 49వేల700 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కారులో ఈ డబ్బును తరలిస్తున్న ఆరుగుర్ని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ హవాలా లావాదేవీలకు ప్రధాన సూత్రధారి విజయ్‌బాయ్ అనే వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించిన వివరాలను అదనపు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం వెల్లడించారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా నడుస్తున్న హవాలా రాకెట్‌కు సూత్రధారి విజయ్‌బాయ్. గుజరాత్‌లోని పంచోత్ గ్రామానికి చెందిన పటేల్ జితేందర్ కుమార్ కంజిబాయ్ అలియాస్ బిట్టు బాయ్ అతడి దగ్గరగా ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. విజయ్ సూచనలతో వివిధ వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి హవాలా మార్గంలో చేరవేస్తుంటాడు. ఫోన్లో మాట్లాడి అవతలి వ్యక్తికి సరిగ్గా చెప్పిన సమయానికి చేతుల్లో డబ్బులు పెట్టడంలో జితేందర్ దిట్ట. పది రూపాయల నోటుపై ఉన్న వరుస సంఖ్యలో చివరి మూడు అంకెలను చెప్పడాన్ని ఒక గుర్తుగా పెట్టుకుని వీరు హవాలాను విజయవంతంగా నడుపుతున్నారు.

హవాలా గ్యాంగ్ అరెస్ట్

హవాలా గ్యాంగ్ అరెస్ట్

హైదరాబాద్ నగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు హవాలా గ్యాంగ్ గుట్టును రట్టు చేశారు. ఒక కోటీ 90లక్షలా 49వేల700 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

హవాలా గ్యాంగ్ అరెస్ట్

హవాలా గ్యాంగ్ అరెస్ట్

ఎటువంటి ఆధారాలు లేకుండా కారులో ఈ డబ్బును తరలిస్తున్న ఆరుగుర్ని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

హవాలా గ్యాంగ్ అరెస్ట్

హవాలా గ్యాంగ్ అరెస్ట్

ఈ హవాలా లావాదేవీలకు ప్రధాన సూత్రధారి విజయ్‌బాయ్ అనే వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించిన వివరాలను అదనపు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం వెల్లడించారు.

హవాలా గ్యాంగ్ అరెస్ట్

హవాలా గ్యాంగ్ అరెస్ట్

గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా నడుస్తున్న హవాలా రాకెట్‌కు సూత్రధారి విజయ్‌బాయ్. గుజరాత్‌లోని పంచోత్ గ్రామానికి చెందిన పటేల్ జితేందర్ కుమార్ కంజిబాయ్ అలియాస్ బిట్టు బాయ్ అతడి దగ్గరగా ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.

హవాలా గ్యాంగ్ అరెస్ట్

హవాలా గ్యాంగ్ అరెస్ట్

విజయ్ సూచనలతో వివిధ వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి హవాలా మార్గంలో చేరవేస్తుంటాడు. ఫోన్లో మాట్లాడి అవతలి వ్యక్తికి సరిగ్గా చెప్పిన సమయానికి చేతుల్లో డబ్బులు పెట్టడంలో జితేందర్ దిట్ట.

హవాలా గ్యాంగ్ అరెస్ట్

హవాలా గ్యాంగ్ అరెస్ట్

జితేందర్‌తోపాటు అహ్మదాబాద్‌కు చెందిన పటేల్ నరేంద్ర, మహేసేనాకు చెందిన పటేల్ దినేష్, బిష్‌నగర్‌కు చెందిన పటేల్ అల్కేష్, కర్ణాటకలోని బసవకల్యాణ్‌కు చెందిన మహ్మద్ రఫీ, కిషన్‌బాగ్‌కు చెందిన రౌడీషీటర్ ఇమ్రానుద్దీన్ ఒక గ్యాంగ్‌గా రాకెట్‌ను నడిపిస్తున్నారు.

హవాలా గ్యాంగ్ అరెస్ట్

హవాలా గ్యాంగ్ అరెస్ట్

అహ్మదాబాద్ నుంచి విజయ్‌బాయ్ రిమోట్ నొక్కితే ఇక్కడ జితేందర్ అండ్ గ్యాంగ్ అడుగులు వేస్తుంది. వీరంతా మారుతీ షిఫ్ట్‌కారులో డబ్బుల సంచులతో వెళ్తుండగా హైదర్‌గూడలోని సెంట్రల్ పార్క్ హోటల్ వద్ద ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీ చేశారు.

హవాలా గ్యాంగ్ అరెస్ట్

హవాలా గ్యాంగ్ అరెస్ట్

జితేందర్ ఈ డబ్బుకు సంబంధించిన తగిన ఆధారాలు చూపించకపోవడంతో వారందరినీ అరెస్టు చేసి డబ్బు స్వాధీనం చేసుకున్నారు.

జితేందర్‌తోపాటు అహ్మదాబాద్‌కు చెందిన పటేల్ నరేంద్ర, మహేసేనాకు చెందిన పటేల్ దినేష్, బిష్‌నగర్‌కు చెందిన పటేల్ అల్కేష్, కర్ణాటకలోని బసవకల్యాణ్‌కు చెందిన మహ్మద్ రఫీ, కిషన్‌బాగ్‌కు చెందిన రౌడీషీటర్ ఇమ్రానుద్దీన్ ఒక గ్యాంగ్‌గా రాకెట్‌ను నడిపిస్తున్నారు. అహ్మదాబాద్ నుంచి విజయ్‌బాయ్ రిమోట్ నొక్కితే ఇక్కడ జితేందర్ అండ్ గ్యాంగ్ అడుగులు వేస్తుంది. వీరంతా మారుతీ షిఫ్ట్‌కారులో డబ్బుల సంచులతో వెళ్తుండగా హైదర్‌గూడలోని సెంట్రల్ పార్క్ హోటల్ వద్ద ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీ చేశారు.

జితేందర్ ఈ డబ్బుకు సంబంధించిన తగిన ఆధారాలు చూపించకపోవడంతో వారందరినీ అరెస్టు చేసి డబ్బు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఇదంతా హవాలా డబ్బు అని తేలినప్పటికీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందన్న వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. నగరంలోనే హవాలా డబ్బును సరఫరా చేస్తున్నారా? లేక ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారా? అన్నది తదుపరి విచారణలో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. రాకెట్‌కు సూత్రధారిగా వ్యవహరిస్తున్న విజయ్‌బాయ్ మాత్రం పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి మారుతీ షిఫ్ట్ కారుతోపాటు ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

English summary
The city police busted a massive hawala racket on Tuesday by arresting six people near Hyderguda. The Commissioner’s Task Force, North Zone team, seized Rs 1.90 crore from the gang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X