అక్కకు ద్రోహం, బావతో సంబంధం: భర్తను చంపిన శ్రీవిద్య నవ్వుతూ, షాకింగ్ విషయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని బావతో కలిసి భర్త నరేంద్రను హత్య చేసిన ఘటనలో భార్య శ్రీవిద్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాదెండ్ల మండలంలో ఓ కాల్వగట్టు వద్ద భర్త మృతదేహాన్ని పడేశారు. అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి.

చదవండి: భర్త హత్య, ప్రియుడితో సంబంధం: 'ప్లాన్ అంతా భార్యదే, ఆ వీడియోలు చూపించేది'

మృతుడికి చెందిన ఒక చెప్పును మాత్రమే పోలీసులు కాల్వగట్టు వద్ద గుర్తించారు. రెండో చెప్పు శ్రీవిద్య బావ వీరయ్య కారులో దొరికింది. వారికి సహకరించిన గుంజి బాలరాజు, పూజల చౌడయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న శ్రీవిద్యను పోలీసులు ఎట్టకేలకు శనివారం అరెస్టు చేశారు.

చదవండి: సుఖంలేక టెక్కీ భర్త హత్య: ప్రియుడితో వెళ్లాలని చంపేశా.. జ్యోతి, స్వాతిని చూశాకేనా?

అక్క భర్తతో సంబంధం

అక్క భర్తతో సంబంధం

నరేంద్ర - శ్రీవిద్యలకు పెళ్లయి మూడున్నరేళ్లవుతోంది. ఆదర్శ సమాజాన్ని తీర్చిదిద్దే గురువు బాధ్యతలను విస్మరించి అక్క భర్తతో సంబంధం నెరపడమే కాకుండా అడ్డుగా ఉన్నాడని భర్త ప్రాణాలు తీయడానికి కారణమైంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుబాడు నివాసి నల్లబోతు నరేంద్ర (27)కు అదే గ్రామంలో ఉండే మేనమామ కూతురు శ్రీవిద్యతో పెళ్లయింది. నరేంద్ర పరిశ్రమ కాపలాదారుగా, శ్రీవిద్య నరసరావుపేటలోని ఓ ప్రయివేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు.

ఫోన్ కాల్స్‌పై దృష్టి పెట్టిన పోలీసులు

ఫోన్ కాల్స్‌పై దృష్టి పెట్టిన పోలీసులు

గత డిసెంబర్ 19న తనను ఇంటికి తీసుకు వెళ్లేందుకు నరసరావుపేటకు రావాలని శ్రీవిద్య భర్తను కోరింది. మరుసటి రోజే మార్గమధ్యంలోని నాదెండ్ల మండలం సాతులూరు పొలిమేరలో నరేంద్ర మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి ఫోన్‌ కాల్స్‌పై దృష్టి సారించారు.

ఫోన్ కాల్ డాటాతో పట్టుబడ్డారు

ఫోన్ కాల్ డాటాతో పట్టుబడ్డారు

మృతుని భార్యకు, ఆమె అక్క లావణ్య భర్త గొట్టిపాటి వీరయ్య అలియాస్‌ వాసుకు మృతికి ముందు ఎక్కువ కాల్స్‌ ఉన్నాయి. దీంతో పోలీసులు ఆ దిశగా కూపీ లాగారు. పెళ్లి కాకముందు నుంచే శ్రీవిద్యతో ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఆవులమందకు చెందిన ఆమె బావ వీరయ్య సంబంధాలు కొనసాగిస్తున్నారని తేలింది. పెళ్లైన తర్వాత కూడా వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని శ్రీవిద్య, వీరయ్య కలిసి నరేంద్రను హతమార్చాలని పథకం వేశారు.

సైనేడ్ కలిపి

సైనేడ్ కలిపి

వీరయ్య తన తోడల్లుడు నరేంద్రకు ఫోన్‌ చేసి ప్రకాశం జిల్లా మార్కాపురంలో తనకు రూ.పది లక్షలు రావాల్సి ఉందని, వసూలుకు సాయం చేయాలని కోరాడు. ఆ డబ్బు వస్తే జనవరి 1న బుల్ల్లెట్‌ కొనిస్తానని ఆశ చూపాడు. గత నెల 19న భార్యను ఇంటికి తీసుకు వచ్చేందుకు నరసరావుపేటకు బయలుదేరిన నరేంద్రను కారులో ఎక్కించుకున్నాడు. బస్టాండ్‌ వద్ద గుంజి బాలరాజు, చౌడయ్యలనూ వెంటబెట్టుకున్నాడు. మద్యం, కూల్ డ్రింక్స్, తినుబండారాలు కొని వినుకొండ మండలం కొత్తపాలెం వద్ద ఓ చోట కారు నిలిపారు. అప్పటికే మత్తులో ఉన్న నరేంద్రకు సైనేడ్‌ కలిపిన మద్యం అందించారు. నరేంద్ర మృతి చెందాడని గుర్తించాక మృతదేహాన్ని సాతులూరు పొలిమేరలో కాల్వ కట్టపై పడేశారు. పక్కన సగం ఖాళీ చేసిన మద్యం సీసాలో పురుగుమందు కలిపి ఆత్మహత్యగా చిత్రీకరించారు. దర్యాప్తు అనంతరం నరేంద్ర అనుమానాస్పద మృతిని పోలీసులు హత్య కేసుగా మార్చారు.

ముఖంలో లేని పశ్చాత్తాపం

ముఖంలో లేని పశ్చాత్తాపం

శ్రీవిద్యను పోలీసులు శనివారం మీడియా ముందుకు తీసుకు వచ్చారు. అప్పుడు ఆమె నవ్వుతూ వచ్చారు. ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. దీంతో అందరూ షాకయ్యారు. బావతో సంబంధం పెట్టుకొని అక్కకు ద్రోహం చేయడమే కాకుండా భర్త ప్రాణాలు తీసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a bizarre incident in Guntur district, which came to light on Friday, Srividya, allegedly killed her husband, Narendra, in December with the help of her lover to continue illicit relationship.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X