సుఖంలేక టెక్కీ భర్త హత్య: ప్రియుడితో వెళ్లాలని చంపేశా.. జ్యోతి, స్వాతిని చూశాకేనా?
Recommended Video

హైదరాబాద్: టెక్కీ నాగరాజు హత్య కేసులో ఆయన భార్య ఓ టీవీ ఛానల్‌తో సంచలన విషయాలు వెల్లడించింది. అయిదేళ్ల క్రితం నాగరాజుతో జ్యోతికి పెళ్లయింది. భర్తతో సుఖం లేదని ఆమె చంపేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆమె మాట్లాడింది.
తాము భర్తను ఎలా చంపామో ఆమె వెల్లడించింది. భర్తను చంపిన తర్వాత తాము హాయిగా జీవించాలనుకున్నామని పేర్కొంది. కానీ ఆమె అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకరైన నరేష్ ఆత్మహత్యాయత్నం, కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

పెళ్లికి ముందే నాగరాజుతో పరిచయం
నాగరాజుతో తన పెళ్లికి ముందే ప్రియుడు కార్తీక్‌తో తనకు పరిచయం ఉందని జ్యోతి వెల్లడించింది. పెళ్లి తర్వాత కూడా కలుసుకున్నట్లు చెప్పింది. తన భర్తను వదిలేసి వస్తే పెళ్లి చేసుకుంటానని కార్తీక్ తనతో చెప్పాడని తెలిపింది.

నిద్రమాత్రలు తెచ్చిఇచ్చిన ప్రియుడు
దీంతో భర్తను చంపాలని నిర్ణయించుకున్నట్లు జ్యోతి చెప్పింది. గత ఏడాది డిసెంబర్ 19వ తేదీన కార్తీక్ తనకు నిద్రమాత్రలు తెచ్చి ఇచ్చాడని తెలిపింది. ఆ నిద్రమాత్రలను గత డిసెంబర్ 31వ తేదీన పాలలో కలిసి తన భర్త నాగరాజుకు ఇచ్చినట్లు చెప్పింది.

అలా చంపేశాం
ఆ తర్వాత తాను కార్తీక్‌కు ఫోన్ చేశానని, అతను తన స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చాడని జ్యోతి తెలిపింది. నిద్రలో ఉన్న తన భర్తకు దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశామని ఆమె ఆ దారుణాన్ని వివరించింది.

పెళ్లి చేసుకొని ప్రశాంతంగా జీవించాలనుకున్నాం
తన భర్త చనిపోయాడని తెలుసుకున్న తర్వాత ఇంటి వెనుక నుంచి మృతదేహాన్ని తరలించి చౌటుప్పల్‌లో పడేశామని చెప్పింది. తాము పెళ్లి చేసుకొని ప్రశాంతంగా జీవించాలని అనుకున్నామని చెప్పింది. కార్తీక్‌ను పెళ్లి చేసుకోవాలనే భర్తను చంపేశామని చెప్పింది. అయితే ఆమె మరో వాదన కూడా ఉంది. తాను భర్తను చంపాలని అనుకోలేదని, తన ప్రియుడే చంపాలని అనుకున్నాడని, నిద్రమాత్రలు వేయమని 19వ తేదీ నుంచి చెప్పాడని, కానీ తాను వేయలేదని చెప్పింది. చివరకు నిద్రమాత్రలు వేశాక కార్తీక్‌కు ఫోన్ చేశానని చెప్పింది. భర్తను చంపిన తర్వాత మూడు నెలలకు తన ఇంటికి తల్లిదండ్రులను అడిగి పెళ్లి చేసుకుంటానని చెప్పాడని చెప్పింది. తన భర్తతో సుఖం లేదని ఆమె తనకు చెప్పేదని ప్రియుడు కార్తీక్ చెప్పాడు. కాగా, పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

స్వాతిని అనుసరించిందా లేక
ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో స్వాతి తన భర్తను చంపిన ఉదంతం తెలిసిందే. స్వాతి విషయం బయటపడటంతో ఆ విషయం తెలిసి స్వాతి అనుసరించిందా లేక సొంతగా ఆలోచన వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications