టెక్కీ భర్త హత్య, ప్రియుడితో సంబంధం: 'ప్లాన్ అంతా భార్యదే, ఆ వీడియోలు చూపించేది'

Posted By:
Subscribe to Oneindia Telugu
  Another Nagarkurnool Swathi Found : మరో స్వాతి: ప్రియుడితో రాసలీలలు, హత్య

  యాదాద్రి భువనగిరి: కార్తీక్ - జ్యోతిల మధ్య పెళ్లికి ముందే పరిచయం ఉందని, ఆమెకు పెళ్లయ్యాక విడిపోయారని, ఇటీవల మళ్లీ ఫోన్ నెంబర్ తెలుసుకొని ఇద్దరు మాట్లాడుకున్నారని యాదాద్రి డీసీపీ శుక్రవారం తెలిపారు. టెక్కీ నాగరాజు హత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే.

  సుఖంలేక టెక్కీ భర్త హత్య: ప్రియుడితో వెళ్లాలని చంపేశా.. జ్యోతి, స్వాతిని చూశాకేనా?

  ప్రియుడితో కలిసి వెళ్లిపోయేందుకు భర్తను భార్యనే చంపింది. నిందితులను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా వారు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కాల్ డేటా, నరేష్ ఆత్మహత్యాయత్నం తదితర అంశాల కారణంగా విషయం వెలుగు చూసిందని చెప్పారు.

  వారి మధ్య ఫిజికల్ రిలేషన్

  వారి మధ్య ఫిజికల్ రిలేషన్

  నిందితుల నుంచి మూడు సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కార్తీక్ - జ్యోతిలకు అంతకుముందే పరిచయం, ప్రేమ ఉన్నప్పటికీ మూడు నెలలుగా తిరిగి ఫోన్ కాంటాక్ట్ ద్వారా మళ్లీ వారి స్నేహం చిగురించిందన్నారు. వారి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ కూడా ఉందన్నారు.

   భార్య కుట్రతోనే హత్య

  భార్య కుట్రతోనే హత్య

  భార్య కుట్రతోనే టెక్కీ నాగరాజు హత్య జరిగిందని డీసీపీ వెల్లడించారు. ప్రియుడి మోజులో జ్యోతి భర్తను చంపేసిందన్నారు. కాగా భర్త నాగరాజు చాలా మంచివాడని స్థానికులు చెబుతున్నారు. జ్యోతి కూడా మంచిగానే కనిపించేదని అంటున్నారు.

   ప్రియుడు కార్తీక్ ఏం చెప్పాడంటే

  ప్రియుడు కార్తీక్ ఏం చెప్పాడంటే

  ఈ హత్యపై జ్యోతి ప్రియుడు కార్తీక్ మాట్లాడుతూ.. తామిద్దరం చాటింగ్ చేసుకున్నామని చెప్పాడు. ఓ సందర్భంలో తనకు పెళ్లయిందని చెప్పిందని, అయితే ఇంకేమిటని తాను అన్నానని, అయితే నాకు నువ్వు అంటే ఇష్టమని చెప్పిందని చెప్పాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏడ్చేదని చెప్పాడు.

   చంపాలనే ఐడియా ఆమెదే

  చంపాలనే ఐడియా ఆమెదే

  చంపాలనే ఐడియా ఆమెదే అని కార్తీక్ చెప్పాడు. భర్తతో సుఖం లేదని చెప్పేదని అన్నాడు. చంపినందుకు ఎలాంటి డబ్బులు తీసుకోలేదని చెప్పాడు. భర్తకు మత్తు బిల్లలు ఇచ్చిన తర్వాత ఆమె తనకు ఫోన్ చేసిందని, తాను స్నేహితులతో కలిసి వెళ్లి, చంపినట్లు చెప్పాడు. ఆ తర్వాత స్నేహితులకు మద్యం తాగించానని చెప్పాడు.

   భర్త చిత్రహింసలు, అందుకే తనతో వచ్చేందుకు సిద్ధపడింది

  భర్త చిత్రహింసలు, అందుకే తనతో వచ్చేందుకు సిద్ధపడింది

  హత్య చేసిన తర్వాత తాము ఎక్కడికీ పారిపోదామని ప్లాన్ చేసుకోలేదని కార్తీక్ చెప్పాడు. జ్యోతితో పరిచయం తమ మధ్య ప్రేమకు దారి తీసిందని చెప్పాడు. భర్త చిత్రహింసలు పెట్టేవాడని చెప్పేదని, అందుకే తనతో రావడానికి సిద్ధపడిందని చెప్పాడు.

   ఆడియోలు, వీడియోలు చూపించేది

  ఆడియోలు, వీడియోలు చూపించేది

  తన భర్త నిత్యం తనను కొట్టేవాడని జ్యోతి ఆడియోలు, వీడియోలు చూపించేదని కార్తీక్ చెప్పాడు. భర్తను చంపి ఎక్కడైనా ప్రశాంతంగా గడుపుదామని చెప్పేదని అన్నాడు. అడిగితే తాను నిద్ర మాత్రల ప్యాకెట్ తెచ్చి ఇచ్చానని చెప్పాడు. తనకు ఫోన్ చేయడంతో స్నేహితులతో వెళ్లి చంపేశామని, కారులో తీసుకెళ్లి చౌటుప్పల్‌లో పడేశామని చెప్పాడు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In yet another case of planned murder of a husband by the wife, the Yadadri Police stumbled upon a case.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి