మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!
సీఎం రేవంత్ మరో ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏర్పాటు అయిన తరువాత వరుసగా పథకాలను అందిస్తున్నారు. ఇప్పుడు, పెండింగ్ లో ఉన్న రెండు పథకాలను అమలుకు సిద్దమవుతున్నారు. మహిళలకు రూ 2, 500, పెన్షన్లు 4 వేలకు పెంపు పైన ప్రకటన కు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు నుంచి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావే శాల్లో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ప్రకటన దిశగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యాయి. తరువాత జరిగిన బీఏసీ సమావేశంలో అజెండా ఖరారు చేసారు. ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ను కొనసాగించాలని నిర్ణయించారు. కాగా.. ఈ నెల 20న తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఆదివారం కూడా సభ నడపాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఉగాది, రంజాన్, శ్రీరామ నవమికి సెలవు ప్రకటించారు. ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ, పద్దులపై చర్చ జరగనుంది. రేపు, ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ నెల 31 అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఆదివారాలు కూడా సమావేశాలు కొనసాగించాలని ఇతర పార్టీల అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి మినహా అన్ని రోజులు నడపాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు.

పెండింగ్ ఎన్నికల హామీల అమలు దిశగా
కాగా, ఈ నెల 20న ప్రవేశ పెట్టే బడ్జెట్ లో పెండింగ్ హామీల అమలు దిశగా కీలక ప్రకటన ఉండే అవకాశం ఉందని పార్టీ నేతల సమాచారం. అందులో భాగంగా వచ్చే ఆర్దిక సంవత్సరం నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ 2, 500 .. అదే విధంగా పెన్షన్ రూ 4,000 కు పెంపు పైన ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా.. కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ కేబినెట్‌లో బడ్జెట్ సమావేశాలపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి సమయంలోనే ఈ రెండు పథకాల అమలు పైన ప్రకటన ఉంటుందని భావించారు. అయితే, ఆర్దిక పరిస్థితుల కారణంగా ఆలస్యం అయింది. త్వరలో జెడ్పీ ఎన్నికలతో పాటుగా మూడు కార్పోరేషన్లు గా విభజించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో... సంక్షేమంతో పాటుగా పెండింగ్ హామీల అమలు పైన బడ్జెట్ లో ప్రకటన చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యం లో బడ్జెట్ పైన రాజకీయంగానూ ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications