ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!!

తెలుగు ప్రజలు వేడుకగా జరుపుకునే పండుగ ఉగాది. అయితే, ఈ ఏడాది ఉగాది ఎప్పుడు. రెండు తేదీల మధ్య ఇప్పటికీ సందేహం కొనసాగుతోంది. తిథి గడియల వల్ల చిన్నపాటి అయోమయం కొనసాగుతోంది. చైత్ర శుక్ల పాడ్యమి తిథి ఉగాది జరుపుకుంటారు. తెలుగు వారికి కొత్త సంవత్సవరం ఈ రోజుతో ప్రారంభం అవుతుంది. దీంతో.. ఉగాది ఎప్పుడు జరుపుకోవాలో పండితులు స్పష్టత ఇస్తున్నారు. అదే సమయంలో సెలవు పైనా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఉగాది తెలుగు వారి సంప్రదాయ పండుగ. ఏ పండుగకు అయినా సూర్యోదయం వేళకు ఆ తిధి ఉంటే ఆ రోజునే జరుపుకోవాలని శాస్త్రం చెబుతోంది. అయితే ఈసారి ఉగాది మార్చి 19న లేదా 20న అన్న సంశయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం 19న వేకువ జామున నాటికి అమావాస్య ఘడియలు నిలిచి ఉండడమే. అయితే అమావాస్య వెంటనే ముగిసి సరిగ్గా 6.52 నిముషాలకు పాడ్యమి వస్తుంది. అలా మార్చి 19, 2026న ఉదయం 6:52 గంటలకు ప్రారంభమైన పాడ్యమి మరుసటి రోజు మార్చి 20న తెల్లవారుజామున 4:52 గంటలకు ముగు స్తుంది. అందువల్ల 20వ తేదీన పండుగ ఉండదు, అలా చైత్ర శుద్ధ పాడ్యమి సూర్యోదయ వేళనే ఉండడంతో మార్చి 19నే ఉగాది జరుపుకోవాలని పండితులు స్పష్టత ఇస్తున్నారు. పంచాంగ శ్రవణం అతి ముఖ్యమైనదిగా అంతా భావిస్తారు.

ugadi-marks-the-first-day-of-the-new-year-as-per-the-traditional-calendars-followed-by-the-people-i

ఉగాది.. రంజాన్ వరుస సెలవులు

కాగా, ఉగాది.. ఆ వెంటనే రంజాన్ కావటంతో వరుస సెలవులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగాది (మార్చి 19, గురువారం), రంజాన్ (మార్చి 20, శుక్రవారం) సందర్భంగా వరుస సెలవులు ఉన్నాయి. ఉగాది 19వ తేదీనే నిర్వహించాలని నిర్ణయించటం తో ఆ రోజునే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అదే విధంగా 20వ తేదీన రంజాన్ సెలవుగా ప్రకటన చేసారు. రంజన్ నెలవంక దర్శనంలో మార్పు జరిగితే సెలవులో మార్పు ఉండే ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా వారాంతపు సెలవులు (21, 22), శ్రీరామ నవమి (27) కూడా ఉండటంతో మార్చిలో మిగిలిన రోజుల్లో సంఖ్య ఎక్కువగా ఉంది, పాఠశాలలకు ఒంటిపూట బడులు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+